»   » ఛార్మి ఐటం సాంగ్ హైలెట్ అవుతుందిట

ఛార్మి ఐటం సాంగ్ హైలెట్ అవుతుందిట

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: హీరోయిన్స్ ..ఐటం సాంగ్స్ లో ఆడిపాడేందుకు సుముఖంగా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా హిందీ చిత్రంలో అలాంటి అవకాశం వస్తే వదులుకోవడం లేదు. ఆ మధ్య శ్రియ 'జిల్లా ఘజియాబాద్‌'లోనూ... ఇటీవల 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌'లో ప్రియమణి ప్రత్యేక గీతాల్లో ఆడిపాడారు. ఇప్పుడు ఛార్మి వంతు వచ్చింది.

ఛార్మీ 'రాంబో రాజ్‌కుమార్‌' అనే చిత్రంలో ఐటెమ్‌ సాంగ్ కి డాన్స్ చేసేందుకు అంగీకారం తెలిపింది. ఇందులో షాహిద్‌ కపూర్‌, సోనాక్షి సిన్హా జంటగా నటిస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రీహరి ఓ ముఖ్య భూమికలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ప్రత్యేక గీతానికి ఛార్మిని ఎంపిక చేసుకున్నారు దర్శకుడు.

ఛార్మి ఇంతకు ముందు 'బుడ్డా హోగా తేరా బాప్‌', 'జిల్లా ఘజియాబాద్‌'లాంటి హిందీ చిత్రాల్లో నటించింది. అయితే ఛార్మికి అక్కడ తగిన గుర్తింపు దక్కలేదు. ఆమె ఈ ఐటం సాంగ్ మీద ఆశలుపెట్టుకొంది.

ఛార్మి మాట్లాడుతూ...''హిందీలో ఇదే నా మొదటి మాస్‌ గీతం. ప్రభుదేవాకి కృతజ్ఞతలు. షాహిద్‌ కపూర్‌తో కలిసి నృత్యం చేయడం చాలా సంతోషంగా ఉంద''ని ఛార్మి చెప్పింది. ప్రస్తుతం ముంబయిలో షూటింగ్ సాగుతోంది. అభిమానుల నమ్మకం నిలబెడతాం అంది.

English summary
Charmi Kaur is confirmed to shake a leg for mass number in a Bollywood film. The movie is Prabhu Deva’s latest directorial ‘Rambo Rajkumar’ starring Shahid Kapoor and Sonakshi Sinha. Confirming the news Charmi said, “"Shootin in Mumbai fr my 1st Massy song in Hindi for #RamboRajkumar ,thanks to PDdancing ,excited to share screen n dance vit shahidkapoor" (sic)”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu