Don't Miss!
- Sports
INDvsAUS : భారత్తో టెస్టు సిరీస్ ముందు.. బెంగళూరులో ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ సెషన్స్
- News
హైదరాబాద్లో మరో దిగ్గజ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్: 1800 మందికి ఉపాధి
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
వరుసగా సినిమా ఆఫర్లు.. యాక్టింగ్ పై మరోసారి తేల్చి చెప్పిన ఛార్మి.. షాకింగ్ డిసిషన్!
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామర్ బ్యూటీ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న వారిలో ఛార్మి కౌర్ ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అగ్రహీరోలతో అందరితో ఆమె ఏదో ఒక విధంగా స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే మెయిన్ హీరోయిన్ గా మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. ఎక్కువగా మీడియం హీరోలతోనే ఆమె కొన్ని స్పెషల్ పాత్రలను చేసింది కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేదు.
ఇక చార్మి మెల్లగా సినిమాలను పక్కన పెట్టేసి రెగ్యులర్ ప్రొడ్యూసర్ గా కొనసాగేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇక ఇటీవల ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన భవిష్యత్తు గురించి షాకింగ్ విషయాలు చెప్పింది. అలాగే రోజు సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయని తెలిపింది.

ఆ సినిమాలతో బిగ్ హిట్స్
2002 నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న చార్మి కౌర్ తెలుగులోనే కాకుండా తమిళం తెలుగు మలయాళం హిందీ సినిమా ఇండస్ట్రీ లో కూడా నటించింది. అయితే మొదట్లో మెయిన్ హీరోయిన్ గా కొన్ని చిన్న సినిమాల్లో నటించిన ఛార్మి ఆ తర్వాత పెద్ద సినిమాల్లో మాత్రం సెకండ్ హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చింది.
చక్రం లక్ష్మి రాఖి వంటి సినిమాల్లో చార్మి పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. నటిగా అయితే కొంతమంది దర్శకులు ఎంతగానో మెచ్చుకున్నారు. ముఖ్యంగా అనుకోకుండా ఒకరోజు, మంత్ర వంటి సినిమాలు ఛార్మీకి బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి.

గ్లామరస్ హీరోయిన్ గానే కాకుండా..
కేవలం గ్లామరస్ హీరోయిన్ గానే కాకుండా మంచి నటిగా కూడా చార్మి చాలా సినిమాల్లో తో గుర్తింపును అందుకుంది. అయితే ఆమె బ్యాడ్ లక్ ఏమిటో గాని పెద్ద సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు అందుకోలేకపోయింది. ఒకవేళ వచ్చినా కూడా సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ లు వచ్చాయి. అంతేకాకుండా కొన్ని స్పెషల్ సాంగ్స్ లలో కూడా నటించింది.

ఆ తరువాత నటన వైపు తిరిగి చూడలేదు
అయితే ఇటీవల కాలంలో ఛార్మి కేవలం నిర్మాతగానే కొనసాగుతోంది. ఆమె పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే ఎక్కువ సినిమాలను నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ్ కూడా దర్శకత్వంతో పాటు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పూరి ప్రొడక్షన్ లో చాలా బిజీగా మారిన చార్మి నటన వైపు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జ్యోతిలక్ష్మీ, మంత్ర 2 తరువాత మళ్ళీ ఆమె నటనవైపు తిరిగి చూడలేదు.

షాకింగ్ డిసిషన్
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఛార్మి తన భవిష్యత్తు ప్రణాళికలపై కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది. ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరిస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్న ఛార్మి మళ్ళీ నటిగా కనిపిస్తుందా అనే విషయంలో కూడా కుండబద్దలు కొట్టేసింది. మళ్ళీ తాను నటిగా ఏ మాత్రం కనిపించకపోవచ్చు అంటూ.. ఇప్పటికి నటిగా చాలా ఆఫర్స్ వస్తున్నాయని చెప్పింది. అయితే తాను మాత్రం నిర్మాతగా బిజీగా ఉండడంతోనే సరిపోతున్నట్లు చెబుతూ మళ్ళీ నటిగా బిజీ అవ్వడం జరగదని తేల్చి చెప్పేసింది. లైగర్ సినిమాకు కూడా ఛార్మి సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది.