»   » ఛార్మికి ..డైమండ్ రింగ్ గిప్ట్ గా ఇచ్చిన నిర్మాత (ఫొటోలు)

ఛార్మికి ..డైమండ్ రింగ్ గిప్ట్ గా ఇచ్చిన నిర్మాత (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హాట్ చార్మీకి ఈ పుట్టిన రోజు వేళ తన నిర్మాత నుంచి ఖరీదైన బహుమతి అందింది. ఆ నిర్మాత ఎవరు అంటే.. ప్రస్తుతం చార్మీతో ‘జ్యోతి లక్ష్మీ' సినిమా రూపొందిస్తున్న సి. కళ్యాణ్. ఆయన చార్మీకి పుట్టిన రోజు కానుకగా లయన్ షేప్ లో ఉన్న ఓ డైమండ్ రింగ్ ని బహుమతిగా ఇచ్చారు. ఈ గిఫ్ట్ తో ఎంతో ఆనంద పడ్డ చార్మీ తన ఆనందాన్ని ట్విట్టర్ లో పంచుకుంది. ఈ ఫొటోలను మీరు ఈ క్రింద చూడవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


జ్యోతి లక్ష్మి విషయానికి వస్తే...

చార్మీ బర్త్ డే కానుకగా జ్యోతి లక్ష్మీ ఫస్ట్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తిచేసుకున్న జ్యోతి లక్ష్మీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Charmy presented with a diamond ring by C Kalyan

పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో చార్మీ ఒక వేశ్యగా కనిపించనుంది. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఓ హార్డ్ హిట్టింగ్ పాయింట్ తో పూరి ఈ సినిమా తీసాడు.
ఈ చిత్రంలో టైటిల్‌ పాత్రను ఛార్మి పోషిస్తోంది. పూర్తి లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా దీన్ని తెరరెక్కిస్తున్నారు. ఈ టీజర్ చూస్తుంటే.... ఇది స్త్రీ వాద సినిమాగా స్పష్టమవుతోంది. స్త్రీ జాతిపై మగజాతి ఆధిపత్యాన్ని ప్రశ్నించేలా ఈ సినిమా ఉంటుందని టీజర్లో విడుదల చేసిన లైన్స్ చూస్తే స్పష్టం వుతోంది.

Charmy presented with a diamond ring by C Kalyan

జ్యోతి లక్ష్మి సినిమా అనగానే ఇది నిన్నటితరం ఐటం గర్ల్ జ్యోతి లక్ష్మి జీవితం గురించి అని అంతా అనుకుంటున్నారు. కానీ పూరి ‘జ్యోతి లక్ష్మి' కాన్సెప్టు ఇది కాదని స్పష్టమవుతోంది. యాక్షన్ కూడా ఈ టీజర్ లో మిక్స్ చేసి వదిలి సినిమాపై ఆసక్తి రేపారు.

ఈ చిత్రం అందరూ అనుకుంటున్నట్లు హీరోయిన్ జీవితం కాదు..ఓ సెక్స్ వర్కర్ జీవిత కథ అని తెలుస్తోంది. అది మల్లాది వెంకట కృష్ణమూర్తి రచన మిసెస్ పరాంకుసం నవల ఆధారంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో పరాంకుసం అనే వేశ్య...వివాహం చేసుకుని అందరిలా వైవాహిక జీవితం గడుపుతూ ఎలా సెటిలైందనే అంశం చుట్టూ తిరిగుతుంది. దాన్నే కొద్ది పాటి మార్పులతో పూరి చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

Charmy presented with a diamond ring by C Kalyan

పేరు క్యాచీగా ఉండాల‌ని ఆలోచిస్తే జ్యోతిలక్ష్మి అయితే బాగుంటుంద‌ని అది ఓకే చేశామ‌ని. అంతేగానీ ఈ సినిమా జ్యోతిల‌క్ష్మి నిజ జీవితానికి సంబంధం లేద‌ని పేర్కొన్నారు.

చార్మీతో పాటు సత్య, వంశీ ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ సినిమాకి పిజి విందా సినిమాటోగ్రఫీ అందిస్తే, సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. సికె ఎంటర్ టైన్మెంట్స్ మరియు శ్రీ సుభ శ్వేతా ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి ఛార్మీ సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.

English summary
CHARMME KAUR tweeted: Thank u C Kalyan garu for this beautiful Lion shaped diamond ring as my Bday gift 💃💃 JAAAAIIIIIIIIII #JyothiLakshmi
Please Wait while comments are loading...