»   » ఛార్మి కొట్టిన దెబ్బకు తాగింది మొత్తం దిగిపోయింది

ఛార్మి కొట్టిన దెబ్బకు తాగింది మొత్తం దిగిపోయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిన్నప్పట్నించీ కూడా నన్ను ఏదైనా అంటే ఊరుకునే తత్వం కాదు నాది. నన్ను ఏమైనా అంటే మొహం మీదే గట్టిగా తిడతాను. ఇండస్ట్రీలో కూడా అలానే ఉంటాను. అందుకే అనవసరంగా నా దగ్గరకి వచ్చి ఎవరూ మాట్లాడరు. ఆ స్వభావం వల్లే ఇప్పటివరకు నాకెలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. శ్రీఆంజనేయం సినిమాకంటే ముందు ఒకసారి మేకప్ సామాను కొనుక్కోవడం కోసం అమ్మని తీసుకుని షాపుకి వెళ్లాను. ఫోన్ వస్తే మాట్లాడదామని బయటకు వచ్చిన నన్ను ఒకడు గట్టిగా నెట్టుకుంటూ వెళ్లాడు. పరిగెత్తుకెళ్లి వాడ్ని పట్టుకుని కొట్టాను. నా దెబ్బలకు అతడికి తాగిన మత్తు దిగిపోయింది అంటూ చెప్పుకొచ్చింది ఛార్మి.

అలాగే...'గర్ల్స్ షుడ్ నెవర్ బి లైక్ ఎ డోర్ మ్యాట్స్' అంటాను. సమాన హక్కులు, స్వాతంత్య్రం అని మాట్లాడుతుంటాం. కాని అబ్బాయి, అమ్మాయి కలిసి డిన్నర్‌కి బయటికెళ్లినప్పుడు అబ్బాయే ఎందుకు బిల్లు డబ్బులు కట్టాలి. ఇద్దరూ పంచుకోవచ్చు కదా. అలా మనం చేస్తే ఖర్చు పెట్టినట్టు ఫోజు పెట్టే అవకాశం వాళ్లకి రాదు. వాళ్ల మైండ్‌సెట్ తప్పక మారుతుంది. ఆడపిల్లల్ని తక్కువగా చేసి మాట్లాడే ధోరణిలో కూడా మార్పు వస్తుంది. సమాజం మారాలని మాటలు చెప్పడం కాకుండా ముందు మన చుట్టూ ఉన్న వాళ్లలో మార్పు తీసుకొస్తే తరువాత సమాజంలో మార్పు దానంతటదే వస్తుంది అంది.

Charmy remembers her early days

ఆమె తాజా చిత్రం 'ప్రతిఘటన' గురించి చెప్తూ... ఒరిస్సాలో ఒక అమ్మాయిపై జరిగిన అత్యాచార ఘటన ఆధారంగా తీసిన సినిమా ఇది. ఆ అమ్మాయి నాలుగున్నరేళ్లుగా కోమాలో ఉంది. ఇప్పటికీ అదే స్థితిలో ఉందట. వాస్తవ కథకి కొంత రాజకీయాన్ని కలిపి తీశారు. ఇందులో నాది న్యూస్ జర్నలిస్టు పాత్ర. రౌడీలకు ఓట్లేసి మనమే ఎన్నుకుంటుంటాం. అలాంటి వాళ్లు నాయకులయితే మహిళల రక్షణ చాలా కష్టం. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. ఆ అంశాలన్నింటినీ ఈ సినిమాలో చాలా బాగా చూపించారు తమ్మారెడ్డి సార్ అంది.

ఇక ఛార్మి ప్రధాన పాత్రలో చరిత్ర చిత్ర పతాకంపై తమ్మారెడ్డి భరద్వాజ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న 'ప్రతిఘటన' చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. డిషాలో ఇద్దరు యువతులపై జరిగిన అత్యాచార ఘటన నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 18 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రాజకీయ నాయకుల ప్రవర్తన, రౌడీల తీరు, ఓటర్లను చైతన్యపరిచే పలు అంశాలను ఈ చిత్రంలో పొందుపర్చినట్లు తమ్మారెడ్డి తెలిపారు.

English summary
Charmy’s ‘Prathigatana’ directed by Thamma reddy Bharadwaja is scheduled to release on April 18 th. Charmi is acting as a Journalist in this heroine oriented film. Reshma is acting in another prominent character. Tammareddy;’s Charitha chitra banner s producing this movie while MM Keeravali is scoring music.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu