»   » పుట్టిన రోజు పూట...పూరి, ఛార్మి కేకపెట్టించారు...(ఫొటోలు)

పుట్టిన రోజు పూట...పూరి, ఛార్మి కేకపెట్టించారు...(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఛార్మి ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాథ్‌ రూపొందిస్తున్న చిత్రం 'జ్యోతి లక్ష్మీ'. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే కార్యక్రమంలో హీరోయిన్ ఛార్మి పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. సి.కల్యాణ్‌ నిర్మాత.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

'జ్యోతిలక్ష్మీ' చిత్రం ప్రచార చిత్ర ఆవిష్కరణ, చార్మి పుట్టినరోజు వేడుకలు ఒకేసారి ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగాయి. చార్మిని మెచ్చుకొనే 'చార్మ్ మి' పోటీలో విజేతలైన అభిమానుల ప్రశంసలు, దర్శక, నిర్మాతలు, చిత్ర యూనిట్ అభినందనల మధ్య ఉక్కిరిబిక్కిరైన చార్మి ''నా జీవితంలో ఇది బెస్ట్ బర్త్‌డే'' అని వ్యాఖ్యానించారు.

ఛార్మీ మాట్లాడుతూ ''నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన చిత్రమిది. ప్రచార చిత్రంలో నేను బుల్లెట్‌ నడుపుతూ కనిపించా. నిజంగా నేనే బుల్లెట్‌ నడిపా. పైగా అదంతా ఒకే టేక్‌లో తీసిన సన్నివేశమిది'అని చెప్పింది.

'జ్యోతి లక్ష్మీ' ట్రైలర్ విడుదల ఫొటోలు... స్లైడ్ షోలో

 పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ....

పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ....

''ఎప్పుడో పాతికేళ్ల క్రితం మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన నవల ఇది. చాలా ఇష్టంగా తీసిన సినిమా ఇది. చిత్రీకరణ పూర్తయింది. జూన్‌లో విడుదల చేస్తాము''అన్నారు.

సి.కల్యాణ్‌ మాట్లాడుతూ....

సి.కల్యాణ్‌ మాట్లాడుతూ....

'''జ్యోతిలక్ష్మీ' విడుదలయ్యాక.. అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకొంటారు. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు.

ఉంగరం గిప్ట్ గా...

ఉంగరం గిప్ట్ గా...

''నిర్మాత సి. కల్యాణ్ నాకు 'జ్యోతిలక్ష్మీ' సినిమానే కాకుండా, నిన్ననే డైమండ్ ఉంగరం కూడా బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చారు'' అని చెప్పారు.

పొగుడుతూ ఉండాలి

పొగుడుతూ ఉండాలి

''చార్మిని రోజూ పొగడాలి. పొగిడితే కానీ పనిచేయదు. డెరైక్షన్ కన్నా పొగడడం కష్టం'' అని పూరీ జగన్నాథ్ చమత్కరించారు.

ఛార్మి అందుకే ఆగిందేమో...

ఛార్మి అందుకే ఆగిందేమో...

పూరి మాట్లాడుతూ... , ''రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ఈ కథ రాసినప్పుడు నేను పుట్టాను. అది వచ్చిన పాతికేళ్ళకు ఈ అమ్మాయి (చార్మి) పుట్టింది. ఇన్నేళ్ళుగా ఈ కథ ఈమె కోసమే ఆగి ఉందేమో'' అని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం....

ప్రస్తుతం....

నేపథ్య సంగీతం పనులు జరుగుతున్నాయనీ, జూన్‌లో సినిమా రిలీజ్ చేస్తామనీ నిర్మాత సి.కల్యాణ్ పేర్కొన్నారు.

బుల్లెట్ నేనే నడిపా..

బుల్లెట్ నేనే నడిపా..

అన్నట్లు, ఈ సినిమాలో తానే స్వయంగా బుల్లెట్ నడిపాననీ, అదీ ఒకే టేక్‌లో ఓకె చేశాననీ చార్మి స్పష్టం చేశారు.

కథేంటి

కథేంటి

జ్యోతి లక్ష్మీ.. ఈ అందానికి దాసోహమవ్వనివాళ్లు లేరు. కాంట్రాక్టరు నుంచి మినిస్టరు వరకూ అందరూ జ్యోతిలక్ష్మి అభిమానులే. ఆమె కొంటె చూపుకు, నడుం ఒంపుకు పడిపోయినవాళ్లే. 'జ్యోతిలక్ష్మి టచ్‌ మీ..' అంటూ ఆమె వెనుక క్యూ కట్టని మగాడు లేడు. అసలింతకీ ఈ జ్యోతిలక్ష్మి ఎవరు? ఆమె కథేంటి? తెలుసుకోవాలంటే 'జ్యోతిలక్ష్మీ' సినిమా చూడాల్సిందే. ఛార్మి ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది.

చార్మి మాట్లాడుతూ -

చార్మి మాట్లాడుతూ -

''కళ్లు మూసి తెరిచే లోపు ఈ సినిమా పూర్తయిపోయింది. నేను నిజజీవితంలో ఎలాగైతే ప్రవరిస్తానో, ఈ సినిమాలో అలాగే చేశాను. ఈ సినిమాలో నేను జీవించానంతే'' అని తెలిపారు.

భాస్కరభట్ల మాట్లాడుతూ..

భాస్కరభట్ల మాట్లాడుతూ..

''మహిళల ఆత్మగౌరవం, ఆత్మాభిమానాలకు అద్దం పట్టే సినిమా ఇది. పూరి గారు ఇప్పటిదాకా చేసిన సినిమాలకు చాలా విభిన్నంగా ఉంటుంది'' అని గేయ రచయిత భాస్కర భట్ల అన్నారు.

ట్రెండ్ కు తగినట్లు మార్పులు

ట్రెండ్ కు తగినట్లు మార్పులు

' నాకు చాలా ఇష్టమైన స్క్రిప్టు ఇది. ప్రముఖ నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తిగారు తన 19వ ఏట రాసిన 'మిసెస్ పరాంకుశం' నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించా. కానీ ఈ ట్రెండ్‌కు తగ్గట్టు మార్పులూ చేర్పులూ చేశాను'' అని పూరి జగన్నాథ్ చెప్పారు.

పాటలు,చిత్రం ఎప్పుడంటే...

పాటలు,చిత్రం ఎప్పుడంటే...

ఈ నెలాఖరులో పాటలను, జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు.

హీరోయిన్ జీవితం కాదు..

హీరోయిన్ జీవితం కాదు..

ఈ చిత్రం అందరూ అనుకుంటున్నట్లు హీరోయిన్ జీవితం కాదు..ఓ సెక్స్ వర్కర్ జీవిత కథ అని తెలుస్తోంది.

నవలలో...

నవలలో...

పరాంకుసం అనే వేశ్య...వివాహం చేసుకుని అందరిలా వైవాహిక జీవితం గడుపుతూ ఎలా సెటిలైందనే అంశం చుట్టూ తిరిగుతుంది. దాన్నే కొద్ది పాటి మార్పులతో పూరి చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

అందుకే ఆ టైటిల్ ..

అందుకే ఆ టైటిల్ ..

పేరు క్యాచీగా ఉండాల‌ని ఆలోచిస్తే జ్యోతిలక్ష్మి అయితే బాగుంటుంద‌ని అది ఓకే చేశామ‌ని. అంతేగానీ ఈ సినిమా జ్యోతిల‌క్ష్మి నిజ జీవితానికి సంబంధం లేద‌ని పేర్కొన్నారు.

 ఎవరెవరు...

ఎవరెవరు...

ఛార్మి కౌర్‌, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, నిర్మాతలు శ్వేతలానా, వరుణ్‌, తేజ,సి.వి.రావు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

 పుట్టిన రోజు పూట...పూరి, ఛార్మి కేకపెట్టించారు...(ఫొటోలు)

పుట్టిన రోజు పూట...పూరి, ఛార్మి కేకపెట్టించారు...(ఫొటోలు)

ఈ కార్యక్రమంలో ఛార్మి, దర్శకుడు పూరి జగన్నాథ్‌, నిర్మాత సి.కల్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు. సీకే ఎంటర్‌టైనమెంట్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి సునీల్‌ కస్యప్‌ సంగీతం అందించారు.

అలాగే...

అలాగే...

నటుడు సంపూర్ణేశ్‌బాబు, రచయిత భాస్కరభట్ల, కెమేరామన్ పి.జి. విందా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

English summary
Charmy's Jyothi Lakshmi Movie Teaser Launched yesterday at Prasad Lab...Hyderabad.
Please Wait while comments are loading...