»   » ఛార్మికి కొంచెం పిచ్చి...అందుకే పెళ్లికు నో

ఛార్మికి కొంచెం పిచ్చి...అందుకే పెళ్లికు నో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :నాకు స్వతహాగా కొంచెం పిచ్చి. అమ్మానాన్న దాన్ని తట్టుకొంటారు కానీ బయటవాళ్లు భరించడం కష్టం. అందుకే పెళ్లి చేసుకోవడం లేదు. అయినా నా పెళ్లి విషయానికొస్తే ఆ పదం అంటేనే నాకు బోర్‌ కొట్టేసింది అంటూ చెప్పుకొచ్చింది ఛార్మి. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన 'జ్యోతిలక్ష్మీ' చిత్రానికి ఛార్మి నటిగానే కాక నిర్మాతగానూ భాగం పంచుకొంది. శుక్రవారం 'జ్యోతిలక్ష్మీ' ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించింది ఛార్మి. ఈ సందర్భంగా పై కామెంట్స్ చేసింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఛార్మి మాట్లాడుతూ... ''జ్యోతిలక్ష్మీ' నా కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన చిత్రం. ఈ సినిమాతో నేను నిర్మాతగానూ మారా. అయితే ఇదంతా పూరి జగన్నాథ్‌గారి చలవే. ఆయనే నాపై నమ్మకం ఉంచారు. నటిగా కంటే నిర్మాతగానే ఎక్కువ కిక్‌ ఇచ్చిన సినిమా ఇది. ఎందుకంటే ఓ కొత్తబాధ్యతను నేను సమర్థంగా నిర్వహించగలను అనే ధీమా ఈ సినిమాతో వచ్చింది.


Charmy talk about her Marriage

ప్రేమ, భావోద్వేగాలూ, కమర్షియల్‌ అంశాలూ.. ఇలా అన్నీ ఉన్న చిత్రమిది. ఇందులో ఓ వేశ్యగా నటించా. ఇది వరకు 'ప్రేమ ఒక మైకం'లోనూ వేశ్య పాత్రలో కనిపించా. ఈ రెండు చిత్రాలకూ చాలా తేడా ఉంది. 'జ్యోతిలక్ష్మీ'లో హీరోయిజం పండించే ఓ హీరోయిన్‌ని చూస్తారు. ఓ సామాజిక అంశంపై మహిళ చేసే పోరాటం అందరికీ నచ్చుతుంది'' అంటూ చెప్పుకొచ్చింది.


ఇక ఈ చిత్రాన్ని 37 రోజుల్లోనే పూర్తిచేశాం. ఇదంతా పూరిగారి ప్లానింగ్‌. రోజూ టీమ్‌ని కూర్చోబెట్టుకొని సన్నివేశాల గురించి చర్చించుకొనేవాళ్లం. ఇటీవల 'జ్యోతిలక్ష్మీ'ని అందరం కలసి చూశాం. సినిమా పూర్తయ్యాక అందరి స్పందన చూసి కళ్లు చెమర్చాయి. ఎందుకంటే ఈ సినిమా విషయంలో ప్రతి విభాగంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకొని నటిగా, నిర్మాతగా రెండు బాధ్యతలు నెరవేర్చా. అందుకే అంత ఉద్వేగానికి లోనయ్యా అంది.


కమర్షియల్‌ హీరోయిన్ గా పేరు తెచ్చుకొన్న ఛార్మి ఆ తరవాత హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న 'మంత్ర', 'అనుకోకుండా ఓ రోజు', 'మంగళ'లాంటి చిత్రాలు నటించి గుర్తింపు తెచ్చుకొంది. ఇప్పుడు 'జ్యోతిలక్ష్మీ'గా తన 'హీరోయినిజం' చూపించడానికి ముందుకొస్తోంది.


Charmy talk about her Marriage

ఛార్మి కౌర్ ప్రధాన పాత్రలో ఛార్మి కౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి, శ్రీశుభశ్వేత ఫిలిమ్స్ బ్యానర్స్ పై డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో శ్వేతలానా, వరుణ్, తేజ్, సి.వి.రావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘జ్యోతి లక్ష్మీ'.


ఛార్మి కౌర్‌, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, నిర్మాతలు శ్వేతలానా, వరుణ్‌, తేజ,సి.వి.రావు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
Speaking at Jyothi Lakshmi promotional event , Charmy revealed that she is not interested in marriage right now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu