Don't Miss!
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- News
మంత్రి రోజాకు మరో పదవి
- Sports
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా స్టార్ ఓపెనర్!
- Lifestyle
హీమోగ్లోబిన్ తక్కువైతే ప్రమాదమే..కార్డియాక్ అరెస్ట్ కు కారణం అవుతుంది. కాబట్టి, ఈ ఆహారాలు తినండి..
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
నాగార్జునే తన వెనక ఉన్నాడని డైరక్ట్ గా ఛార్మి..
కెరీర్ నుంచి ఫేడవుట్ అయిన ఛార్మికు వరస ఆఫర్స్ ఇప్పిస్తున్నది నాగార్జనే అని గత కొద్ది రోజులుగా ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఛార్మి డైరక్ట్ గా ఒప్పుకుంటోంది. ఆమె మీడియాతో మాట్లాడుతూ... ''నాగార్జున నా లక్కీ హీరో . 'మాస్' సినిమాతో నాకు తొలి హిట్టు వచ్చింది. ఆ సినిమాకి నాగే నిర్మాత. 'మాస్'తో హీరోయిన్ గా నిలబడిపోయాను. 'రగడ'తో నా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించినట్లయింది. ఆ సినిమాలో నాగ్ పక్కన ఓ స్పెషల్ సాంగ్ చేసాను. వెంటనే 'మంగళ' విడుదలైంది.
ఇప్పుడు వర్మ 'దొంగల ముఠా' వస్తోంది. బాలీవుడ్ లో అమితాబ్ సినిమాలో చేస్తున్నాను. అంతా నాగ్ మహత్యమే '' అంది. అలాగే నాకు చాలా విషయాల్లో నాకు చేదోడువాదోడుగా ఉన్నారు. ఎన్నో విషయాల్లో నాకు సహాయం చేశారు. నన్నో ప్రెండ్ గా భావించే విధానం నాకెంతో నచ్చుతుందంటూ మెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన దొంగలముఠా రిలీజ్ కు రెడీగా ఉంది. అలాగే రీసెంట్ గా చేసిన మంగళ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. పూరి దర్శకత్వంలో హిందీలో చేస్తున్న బుడ్డా సినిమాపై ఆమె ఆశలన్ని ఉన్నాయి.