»   » యాంకర్ రేష్మిని అలా ఊహించుకుని వెళితే అంతే (ఫోటోస్)

యాంకర్ రేష్మిని అలా ఊహించుకుని వెళితే అంతే (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాంకర్ రేష్మిని ఇప్పటి వరకు జబర్దస్త్ కామెడీ షోలో.... తర్వాత 'గుంటూరు టాకీస్' మూవీలో గ్లామరస్ లుక్ లో మాత్రమే చూసాం. ఈ నేపథ్యంలో ఆమె తర్వాతి సినిమా కూడా అలానే గ్లామరస్‌గా ఉంటుందని ఊహించుకోవడం సహజం. కానీ 'చారుశీల' అనే చిత్రంలో రేష్మి అందుకు భిన్నంగా కనిపించబోతోంది. సస్పెన్స్ థ్రిలర్ గా కామెడీ జోడించి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

వి.శ్రీనివాసరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. జోత్స్న ఫిలిమ్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు వి.సాగర్, శిద్దిరెడ్డి జయశ్రీ అప్పారావు సంయుక్తంగా నిర్మించిన సినిమా 'చారుశీల'. బ్రహ్మానందం, రేష్మి, రాజీవ్ కనకాల, జశ్వంత్ ముఖ్య తారాగణం. ఈ సినిమా లోగో, ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల ఫిల్మ్ చాంబర్ లో జరిగింది. దర్శకులు భీమనేని శ్రీనివాసరావు టైటిల్ లోగో ఆవిష్కరించారు. జి.నాగేశ్వరరెడ్డి, ఎ.ఎస్.రవికుమార్ చౌదరిలు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

దర్శకుడు శ్రీనివాస్ వుయ్యూరు మాట్లాడుతూ.. "థ్రిల్లర్ సబ్జెక్ట్ ఇది. మూడేళ్లుగా ప్లాన్ చేస్తున్నాను. సినిమాటోగ్రాఫర్ గా 100 సినిమాలు పూర్తయిన తర్వాత చేయాలనుకున్నాను. మా అన్నయ్య సాగర్ గారికి లైన్ చెప్పగా, మనమే ప్రొడ్యూస్ చేద్దామన్నారు. వీల్ చైర్ లో కూర్చునే పాత్రలో రాజీవ్ కనకాల నటిస్తాడా? లేదా? అని భయపడ్డాను, ఒప్పుకున్నాడు. అద్బుతంగా నటించాడు, రాజీవ్ కనకాల, రేష్మిలకు అవార్డులు వస్తాయి. మా అబ్బాయి ఓ క్యారెక్టర్ చేశాడు. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం" అని అన్నారు.

రాజీవ్ కనకాల మాట్లాడుతూ..

రాజీవ్ కనకాల మాట్లాడుతూ..

"పోస్టర్ ఎంత సైలెంట్ గా ఉందో, సినిమా అంత వైలెంట్ గా ఉంటుంది. చిన్న సినిమాల్లో పెద్ద సినిమా అయ్యే గొప్ప సినిమా ఇది" అని అన్నారు.

భీమనేని శ్రీనివాసరరావు మాట్లాడుతూ..

భీమనేని శ్రీనివాసరరావు మాట్లాడుతూ..

దర్శకుడిగా, అసోసియేషన్ ప్రెసిడెంట్ గా.. అందరి తలలో నాలుకలా, అందరి సమస్యలు పరిష్కరించే సాగర్ గారు ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు. మంచి సినిమా తీశారు. రాజీవ్ కనకాల, రేష్మి నటిస్తున్న ఈ సినిమా సక్సెస్ కావాలి" అని అన్నారు.

జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ..

జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ..

"సాగర్ గారు కోట్లు సంపాదించలేదు. కానీ, కోట్లు సంపాదించే శిష్యులను (దర్శకులు) ఇండస్ట్రీకి అందించారు. ఈ సినిమాతో కోట్లు సంపాదించాలని కోరుకుంటున్నాను. మంచి సినిమాతో తమ్ముడ్ని దర్శకుడిగా, తమ్ముడి కుమారుడిని హీరోగా పరిచయం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి నిర్మాతే ముఖ్యం. ఇటువంటి నిర్మాతలు ఇంకా రావాలి" అని అన్నారు.

ఎ.ఎస్.రవి కుమార్ చౌదరి మాట్లాడుతూ..

ఎ.ఎస్.రవి కుమార్ చౌదరి మాట్లాడుతూ..

"నాతో పాటు శ్రీనువైట్ల, వి.వి.వినాయక్ సాగర్ గారి శిష్యులమే. సాగర్ గారంటే మాకు ఎంతో వినయం, భక్తి, గౌరవం. అనివార్య కారణాల వలన వినాయక్, శ్రీనువైట్ల ఇక్కడికి రాలేకపోయారు. వారి విషెస్ తెలపమన్నారు. వంద సినిమాలకు చేరువైన సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస్ వుయ్యూరు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. మేమంతా ఆయన కెమెరా ముందు క్లాప్ కొట్టినవాళ్ళమే. మా ఇష్టజీవి సాగర్, కష్టజీవి శ్రీనివాస్ గార్లు ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలి" అని అన్నారు.

నటీనటులు

నటీనటులు

బెనర్జీ, మెల్కోటే, రాకెట్ రాఘవ, గెటప్ శీను, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటించారు.

తెరవెనక

తెరవెనక

ఈ చిత్రానికి మాటలు : కుమార్ మల్లారపు, ఎడిటింగ్ : వి.నాగిరెడ్డి, సంగీతం : సుమన్ జూపూడి, ఆర్ట్ : బాబ్జీ, నిర్మాతలు : వి.సాగర్ & శిద్దిరెడ్డి జయశ్రీ అప్పారావు, కథ - స్క్రీన్ ప్లే - సినిమాటోగ్రఫీ - దర్శకత్వం :శ్రీనివాస్ రెడ్డి వుయ్యూరు.

English summary
Watch the first look launch of the movie Charu Seela. The first look has been launched by AS Ravi Kumar Chowdary and G srinivas Reddy.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu