»   »  బండ్ల గణేష్‌పై చీటింగ్ కేసు పెట్టిన హీరో

బండ్ల గణేష్‌పై చీటింగ్ కేసు పెట్టిన హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ నిర్మాణ బండ్ల గణేష్ మీద చీటింగ్ కేసు నమోదైంది. దీంతో పాటు చెక్ బౌన్స్ కేసు కూడా నమొదైంది. ‘నీజతగా నేనుండాలి' సినిమా విషయంలో బండ్ల గణేష్ తమను మోసం చేసాడని సినీ నటుడు సచిన్ జోషి‌కి సంబంధించిన వైకింగ్ మీడియా సంస్థ ఈ కేసు పెట్టింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు అందజేసారు.

హిందీలో సూపర్ హిట్ అయిన ‘ఆషికి 2' చిత్రాన్ని సచిన్ జోషి హీరోగా తెలుగులో ‘నీజతగా నేనుండాలి' పేరుతో రీమేక్ చేసారు. నజియా హీరోయిన్ గా నటించింది. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై జయ రవీంద్ర దర్శకత్వంలో ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించారు.

Cheating case against Bandla Ganesh

ఈ చిత్రానికి గణేష్ నిర్మాతగా ఉన్నప్పటికీ పెట్టుబడి పెట్టింది మాత్రం సచిన్ జోషికి చెందిన వైకింగ్ మీడియా సంస్థనే. డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో గణేష్ మోసం చేసాడని, నష్టాలు వచ్చాయని తప్పుడు లెక్కలు చూపాడని ఆ సంస్థ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని హీరో సచిన్ జోషికి చెందిన వికింగ్‌ మీడియా, బండ్ల గణేష్‌ కు చెందిన పరమేశ్వర ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ తెలుగు రీమేక్ ని నిర్మించాయి. అయితే హీరోనే మొత్తం డబ్బులు పెడుతున్నారని అప్పట్లో అంతటా వినిపించింది. బండ్ల గణేష్ కేవలం పేపరు పైన మాత్రమే నిర్మాత గా మాత్రమే...ఓ క్యాషియర్ గా వ్యవరించాడని అప్పట్లో టాక్.

English summary
Actor Sachin joshi files cheating case on Bandla Ganesh.
Please Wait while comments are loading...