»   » ఆరు కోట్లు మోసగించాడు.. నిర్మాత కల్యాణ్‌పై కేసు.. చిక్కుల్లో ఆరడుగుల బుల్లెట్

ఆరు కోట్లు మోసగించాడు.. నిర్మాత కల్యాణ్‌పై కేసు.. చిక్కుల్లో ఆరడుగుల బుల్లెట్

Written By:
Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన 'దువ్వాడ జగన్నాథం' సినిమా పాటపై వివాదం సద్దుమణుగుతుందని అనుకుంటుండగానే మరో తెలుగు సినిమా చిక్కుల్లో పడింది. తాజాగా వివాదం గోపీచంద్‌ హీరోగా నటించిన 'ఆరడుగుల బుల్లెట్‌' సినిమాను చుట్టుకున్నది. ఈ సినిమా కోసం నిర్మాత సీ కలాణ్‌ రూ. 6 కోట్లు తీసుకుని మోసం చేశారని సహదేవ్‌ అనే ఎన్నారై ఆరోపించారు. ఈ మేరకు కళ్యాణ్‌, తాండ్ర రమేశ్‌పై సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడం మరింత సంచలనంగా మారింది.

అనేక సమస్యల్లో ఆరడుగుల బుల్లెట్

అనేక సమస్యల్లో ఆరడుగుల బుల్లెట్

గత మూడేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ ఆరడుగుల బుల్లెట్ అనేక సమస్యల్లో కూరుకుపోయింది. ఇటీవలే అన్ని సమస్యలను పరిష్కరించుకొని ఈ నెల 9న విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ సినిమాకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని అనుకొంటున్న సమయంలో తాజా వివాదం నెలకొనడం సినిమా రిలీజ్‌కు అడ్డంకిగా మారే ప్రమాదం కనిపిసున్నది.


6 కోట్లు అప్పుగా తీసుకుని

6 కోట్లు అప్పుగా తీసుకుని

నిర్మాత సి కల్యాణ్ తన వద్ద రూ.6 కోట్లు అప్పుగా తీసుకుని మోసం చేశాడు. తన వద్ద అప్పుగా తీసుకున్న మొత్తం తిరిగి చెల్లించే వరకు 'ఆరడుగుల బుల్లెట్' విడుదలని నిలిపివేయాలి అని సీసీఎస్‌కు దాఖలు చేసిన పిటిషన్‌లో సహదేవ్ పేర్కొన్నట్టు సమాచారం.


గోపీచంద్‌ సరసన నయనతార

గోపీచంద్‌ సరసన నయనతార

జయబాలాజీ రియల్‌ మీడియా పతాకంపై తెరకెక్కిన సినిమాలో గోపీచంద్‌ సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. ఈ చిత్రం ప్రమోషన్‌కు రావాలంటూ హీరోయిన్‌ నయనతారను కోరగా ఆమె అదనంగా రూ.35 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి.


బీ గోపాల్ డైరెక్షన్‌లో సీ కల్యాణ్ నిర్మిస్తున్న

బీ గోపాల్ డైరెక్షన్‌లో సీ కల్యాణ్ నిర్మిస్తున్న

బీ గోపాల్ డైరెక్షన్‌లో సీ కల్యాణ్ నిర్మిస్తున్నఈ సినిమా విడుదలకు సరిగ్గా ఇంకా కేవలం మూడు రోజులే మిగిలి వుంది. ఇంతలోనే ఈ సినిమా విడుదల ఆపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై నిర్మాత సీ కల్యాణ్‌ ఇంకా స్పందించలేదు. ఒకవేళ సీ కల్యాణ్ స్పందిస్తే ఈ వివాదం కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.English summary
Cheating case filed on Producer C Kalyan by NRI Sahadev
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu