»   »  తారక రత్న దర్శకుడు పై చీటింగ్ కేసు నమోదు

తారక రత్న దర్శకుడు పై చీటింగ్ కేసు నమోదు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: తారకరత్న తో 'మైక్ టెస్టింగ్ వన్‌టూత్రీ' అనే చిత్రం రూపొందిస్తున్న దర్శకుడు వీరు కె. పై చీటింగ్ కేసు నమోదైంది. తనను మోసం చేశాడంటూ నిర్మాత జానీ.. వీరుపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. 'మైక్ టెస్టింగ్ వన్‌టూత్రీ' అనే సినిమా ఒప్పందం విషయంలో తనను మోసం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నందమూరి తారకరత్న, అర్చన, నరేష్‌, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్న చిత్రం 'మైక్‌ టెస్టింగ్‌ 143'. ఈ చిత్రంలో తారకరత్న దయానంద్ గా కనపించనున్నారు. ఉత్సవాలు, పండుగల సమయాల్లో నాటకాలు వేసే కంపెనీ నడుపుతుంటాడు దయానంద్‌. దయానంద్‌కి నాటకాలంటే ఎంతో అభిమానం. ఓ సినిమాని వెండితెరపై గొప్పగా మలచాలని దర్శకుడు ఎంత తపన పడతాడో.. తను రూపొందించే నాటకం కూడా వేదికపై అదిరిపోయేలా ఉండాలని కష్టపడతాడు. దసరాకి నాటకం వేయడానికి రాయలసీమలోని ఓ ప్రాంతం నుంచి ఆహ్వానం అందుతుంది. అక్కడికి వెళ్లిన దయానంద్‌కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో తెరపైనే చూడాలి.


వీరు.కె. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో తారకరత్న సరసన అర్చన జంటగా నటిస్తున్నారు. కె.రాజు నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ...'ప్రసుత్తం హైదరాబాద్‌ పరిసరాల్లో ఓ పాట సహా టాకీ చిత్రీకరిస్తున్నాం. చక్కటి వినోదాన్ని పంచే చిత్రంలో తొలిసారిగా నటిస్తున్నానని తారక్‌ చెప్పారు. మా బ్యానర్‌లో ఇది 6వ సినిమా..అని నిర్మాత రాజా తెలిపారు. సీతగా మరోసారి కన్పించనున్నట్టు అర్చన పేర్కొంది. సుమన్‌, సాయాజీ షిండే, కృష్ణుడు, బ్రహ్మానందం, నరేష్‌, జీవా, కొండవలస తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: అంజి, సంగీతం, దర్శకత్వం: వీరు కె.

English summary

 A cheating case was filed on director Veeru K (2 much & Xtra fame) by Banjara hills police with regard to a complaint filed by a person to whom Veeru K owed some money. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu