»   »  ఐశ్వర్య రాయ్ రీ ఎంట్రీ మూవీ ‘జజ్బా’ ఫస్ట్ లుక్ (ఫోటో)

ఐశ్వర్య రాయ్ రీ ఎంట్రీ మూవీ ‘జజ్బా’ ఫస్ట్ లుక్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బిడ్డకు జన్మనిచ్చినప్పటి నుండి ఐశ్వర్యరాయ్ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె మళ్లీ సినిమాల్లో ఎప్పుడు నటిస్తుందో? అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె సంజయ్ గుప్తా దర్శకత్వంలో ‘జజ్బా' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేసారు.


ఈ సినిమా కోసం ఐశ్వర్యరాయ్ గత కొంతకాలంగా సన్నద్ధం అవుతోంది. సినిమాలో తాను చేయబోయే పాత్రకు తగిన విధంగా శరీరాకృతిని మలుచుకుంది. ఇందులో ఆమె పలు యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటిస్తున్నట్లు సమాచారం. చాలా కాలం తర్వాత ఐశ్వర్యరాయ్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Check Out Amazing Aishwarya Rai's Jazbaa First Poster

ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తోంది. ఐశ్వర్యరాయ్ తో పాటు ఇర్ఫాన్ ఖాన్, షబానా అజ్మి, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్సెల్ విజన్ ప్రొడక్షన్స్ ప్రై.లి. వైట్ ఫాదర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉన్నారు. అక్కడ కూడా ఈ చిత్రం గురించి ప్రమోషన్స్ నిర్వహించారు.

English summary
Aishwarya Rai Bachchan is making her comeback in Bollywood with Sanjay Gupta's Jazbaa. The film will be showcased at the 68th Cannes Film Festival.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu