»   » స్టైల్‌తో చంపేస్తున్నావ్ బాసూ...! (చిరు 150 న్యూ ఫోటోస్)

స్టైల్‌తో చంపేస్తున్నావ్ బాసూ...! (చిరు 150 న్యూ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి..... తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్. వయసులో ఉన్నపుడు వెండి తెరపై ఆయన జోరు ఎలా ఉందో, బాక్సాఫీసును ఎలా రఫ్పాడించారో అందరికీ తెలుసు. అయితే ఇపుడు చిరంజీవి వయసు 61 సంవత్సరాలు. ఈ వయసులో ఆయన హీరోగా సినిమా చేస్తున్నాడు.

ఎంత మెగాస్టార్ అయినా... ఈ వయసులో కుర్రోడిలా చేయడం కష్టమే అనేది కొందరి అభిప్రాయం. అయితే వారి అభిప్రాయాలన్నింటినీ పటాపంచలు చేస్తూ మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో స్టైలిష్ లుక్ తో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నారు.


స్టైల్ అదిరింది బాసూ..

స్టైల్ అదిరింది బాసూ..

చిరంజీవి 150వ సినిమా ఫోటో షూట్ కు సంబంధించిన కొన్ని న్యూ ఫోటోస్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ విడుదల చేసింది. ఈ ఫోటోస్ చూసిన అభిమానులు స్టైల్ తో చంపేస్తున్నావ్ బాసూ అంటూ తమ అభిమాన హీరోను ఈ లుక్ లో చూసి సంబర పడి పోతున్నారు.


అరవైలో ఇరవై

అరవైలో ఇరవై

అరవైలో ఇరవైలా ఉండటం అంటే ఇదేనేమో. మోగాస్టార్ చిరంజీవి యవ్వనంలో ఉన్నప్పటి నుండే ఫిట్ నెస్, డైట్ బాగా మెయింటేన్ చేస్తున్నారు కాబట్టే ఆయన ఇపుడు ఇంత స్టైలిష్ గా ఉన్నాడని అంటున్నారంతా.


వివి వినాయక్, రామ్ చరణ్

వివి వినాయక్, రామ్ చరణ్

తెరపై మనకు చిరంజీవి కనిపిస్తాడు, ఎంటర్టెన్ చేస్తాడు...... దీని వెనక దర్శకుడు వివి వినాయక్, నిర్మాత రామ్ చరణ్, ఇంకా చాలా మంది టెక్నీషియన్స్ కష్టపడుతున్నారు.


దేవిశ్రీ ప్రసాద్

దేవిశ్రీ ప్రసాద్

తెలుగు సినిమాలో హీరో పెర్ఫార్మెన్స్ ఇతరత్రా నటనకు సంబంధించిన అంశాల తర్వాత బాగా హౌలెట్ అయ్యే అంశం సంగీతం. అందరికీ మ్యూజిక్ కొట్టినట్లే చిరంజీవి 150వ సినిమాకు మ్యూజిక్ కొడితే స్పెషల్ ఏముంటుంది. అందుకే తన కెరీర్లోనే బెస్ట్ మ్యూజిక్ ఇచ్చేందుకు తన శక్తిమేర ప్రయత్నిస్తున్నాడు సౌత్ సెన్సేషన్, తెలుగు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్.


సెన్సేషన్ సింగర్స్ ను

సెన్సేషన్ సింగర్స్ ను

ఈ సినిమా కోసం ఇప్పటి వరకు తెలుగులో పాడని, బాలీవుడ్లో, పంజాబీలో బాగా పాపులర్ అయిన సింగర్లను రంగంలోకి దించారు. గతంలో దేవిశ్రీ అపాచె ఇండియన్, రఘు దీక్షిత్, బాబా సెహగల్, నేహా బాసిన్ లాంటి బాలీవుడ్ సింగర్లను టాలీవుడ్ కి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హాట్ పంజాబీ సెన్సేషన్ సింగర్ జాస్మిన్ సండ్లాస్ తో చిరంజీవి 150వ సినిమాకు పాడించారు.


హీరోయిన్ కాజల్

హీరోయిన్ కాజల్

తెరపై రొమాంటిక్ సీన్లు, గ్లామర్ సీన్లు బాగా పండాలంటే అందమైన హీరోయిన్ తప్పనిసరి. చిరంజీవి వయసైపోయినోడు కదా అని ఏదో వయసైపోయిన హీరోయిన్ ను తీసుకురాలేదు. కత్రిలాంటి అందగత్తె కాజల్ ను ఎంపిక చేసారు.


చిరంజీవితో చేయడంపై

చిరంజీవితో చేయడంపై

ఇంత మంచి అవ‌కాశం వ‌చ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. షూటింగులో పాల్గొన‌డం ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. చిరంజీవితో చేసే అవకాశం రావడం నా అదృష్టమని కాజల్ చెప్పుకొచ్చారు.


ఆ సీన్ ఉంటుందా?

ఆ సీన్ ఉంటుందా?

కత్తి తమిళ వెర్షన్ లో హీరో విజయ్ ఓ సీన్లో అండర్ వేర్ తో నటించారు. పోలీస్ స్టేషన్లో సీన్ లా ఉంది. ఒక స్టార్ హీరో అండర్ వేర్లో కనిపించడం అంటే సీన్ లో తీవ్రత, సహజత్వం కోసమే అలా చేసి ఉంటారు. దానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ‘ఖైదీ నెం.150'లో చిరంజీవి కూడా అండర్ వేర్లో కనిపిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.


వినోదం గ్యారంటీ

వినోదం గ్యారంటీ

కమర్షియల్ ఎంట్టెనర్ చిరంజీవి సినిమాలంటేనే వినోదానికి పెట్టింది పేరు. ఆయన కెరీర్లో కొన్ని ప్రయోగాత్మక సనిమాలు చేసినా.... ఎక్కువగా చేసినవి వినోదాత్మకంగా సాగే కమర్షియల్ ఎంటర్టనర్సే. ఆయన అభిమానులు ఎక్కువగా ఇలాంటి సినిమానే కోరుకుంటున్న నేపథ్యంలో 150వ సినిమా కూడా అలానే రూపొందిస్తున్నారు.


సంక్రాంతి కానుక

సంక్రాంతి కానుక

సినిమాకు సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి 2017 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తేవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు తగిన విధంగనే చకచకా సినిమాను ముందుకు నడిపిస్తున్నారు వినాయక్.


English summary
Check Out Chiranjeevi's Look Test For Khaidi No150. Khaidi No. 150 is an upcoming Indian Telugu action drama film directed by V. V. Vinayak. It features Chiranjeevi and Kajal Aggarwal in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu