twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ ప్రెస్ మీట్: ప్రజా కోర్టులో శిక్ష పడింది, నెక్ట్స్ మూవీ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’

    |

    'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీయడానికి కారణం ఎన్టీఆర్ జీవితంలో చివర్లో ఏం జరిగిందో చెప్పడమే తప్ప ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. మే 31న ఈ చిత్రాన్ని ఏపీలో విడుదల చేస్తున్న నేపథ్యంలో రాంగోపాల్ వర్మ ఆదివారం సాయంత్రం బెజవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

    గతంలో నా సినిమా విడుదల చేయడానికి ప్రయత్నిస్తే... విజయవాడలో అన్యాయంగా అరెస్టు చేశారని, ఏపీలో కావాలనే సినిమా రిలీజ్ అడ్డుకున్నారని తెలిపారు. అలా చేసిన వారి సైకిల్ టైరు ఇపుడు పంక్చర్ అయిందని తెలిపారు. తనను బెజవాడలో అడుగు పెట్టకుండా ఫోన్లో ఒకరు ఆర్డర్ వేశారని, ఆ ఆర్డర్ ఎవరు వేశారో అందరికీ తెలుసని వర్మ వ్యాఖ్యానించారు.

     సినిమా విడుదలకు ముందే శిక్ష పడింది

    సినిమా విడుదలకు ముందే శిక్ష పడింది

    లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఉన్న పాత్రదారులే ఇపుడు నిజంగా రాజకీయాల్లో ఉన్నారని వర్మ తెలిపారు. సినిమా విడుదలకు ముందే ఎన్టీ రామారావును కష్టాలకు గురి చేసిన వ్యక్తిని ప్రజా కోర్టులో శిక్షించారన్నారు. వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గురించే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    నిజాన్ని ఎవరూ ఆపలేరు

    నిజాన్ని ఎవరూ ఆపలేరు

    ఒక మహా కవి చెప్పినట్లు నిజాన్ని మీరు డీలైట్ చెయొచ్చుకానీ... దాన్ని ఆపలేరు. ఎప్పుడో ఒకప్పుడు బయట పడుతుంది. అది బయట పడే టైమ్ ఇప్పుడు వచ్చింది. 31న లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అవుతోంది. 25 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన ఈ చిత్రంలో చూపించామని తెలిపారు.

    ఎన్టీఆర్ గారు ఆ వ్యక్తిని నమ్మి నాకన్నా పెద్ద తప్పు చేశారు

    ఎన్టీఆర్ గారు ఆ వ్యక్తిని నమ్మి నాకన్నా పెద్ద తప్పు చేశారు

    ఏ వ్యక్తి పేరు చెప్పుకుని ఓట్లు అడుక్కుంటున్నారో ఆ వ్యక్తిని మీరు ఏం చేశారు అనేది చెప్పడం నేను చేసిన ఒకే ఒక్క తప్పు. కానీ ఎన్టీఆర్ గారు ఆ వ్యక్తిని నమ్మి నాకన్నా పెద్ద తప్పు చేశారు.... ఫైనల్‌గా నా సినిమా రాక ముందే ఆ వ్యక్తికి ప్రజాకోర్టులో శిక్ష పడటం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆ వ్యక్తి పేరు నేను నా నోటితో చెప్పలేను. సినిమా చూస్తే మీకే అర్థమవుతుందని వర్మ తెలిపారు.

    పైపుల రోడ్డు సర్కిల్‌లో అందుకే ప్రెస్ మీట్ పెట్టలేదు

    పైపుల రోడ్డు సర్కిల్‌లో అందుకే ప్రెస్ మీట్ పెట్టలేదు

    పైపుల రోడ్డు సర్కిల్‌లో ప్రెస్ మీట్ పెట్టకుండా ఎన్నికల ముందు మమ్మల్ని బలవంతంగా అడ్డుకున్నారు. కానీ ఇపుడు పోలీసులు మమ్మల్ని అక్కడ ప్రెస్ మీట్ వద్దని రిక్వెస్ట్ చేశారు. ఎన్నికలు ఇటీవలే జరిగాయి, ఒకే చోట చాలా మంది జనం గుమికూడితే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని వారు చెప్పడం, విపరీతమైన ఎండ కూడా ఉండటం వల్ల మా నిర్ణయం మార్చుకున్నామరని తెలిపారు.

    నేను ఎలాంటి కాంట్రవర్సీ చేయలేదు

    నేను ఎలాంటి కాంట్రవర్సీ చేయలేదు

    నేను ఎలాంటి కాంట్రవర్సీ చేయలేదు. నేనొక ఫిల్మ్ మేకర్. జరిగిన కాంట్రవర్సీని సినిమాగా తీశా. కంట్రవర్సీ చంద్రబాబు నాయుడు చేశారు. నేను సినిమా తీశానంతే. నా మోటివ్ ఒక్కటే... 70 సంవత్సరాలు మహారాజుగా బ్రతికిన ఎన్టీ రామారావు, చివరి దశలో కొన్ని నెలల పాటు నరకయాతన అనుభవించారు. ఆయన అలా కావడాకి కారణమైంది ఎవరు? అనేది అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని నాకు స్ట్రాంగ్ గా అనిపించింది. అందుకే సినిమా తీసినట్లు తెలిపారు.

    అది అతిపెద్ద ద్రోహం, వెన్నుపోటు అదే

    అది అతిపెద్ద ద్రోహం, వెన్నుపోటు అదే

    ఎన్టీ రామారావుకు ద్రోహం చేసిన వారు 25 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఫోటో పెట్టుకుని ఓటు వేయాలని మళ్లీ ప్రజల వద్దకు వెళుతున్నారు. దానికంటే వెన్నుపోటు హిస్టరీలో ఎప్పుడూ లేదనేది నా ఉద్దేశ్యం. దాన్నే తెరపై చూపించాలనుకున్నట్లు వెల్లడించారు.

    నచ్చకపోతే మొహం మీద చెప్పాల్సింది

    నచ్చకపోతే మొహం మీద చెప్పాల్సింది

    అప్పడు తప్పనిసరి పరిస్థితులో అలా చేయాల్సి వచ్చిందని ఒక వ్యక్తి చెప్పడం చాలా సార్లు విన్నాం. మీకు ఆయన మీద వ్యతిరేకత ఉన్నపుడు డైరెక్టుగా మీ పాలసీలు నచ్చడం లేదు, లక్ష్మీ పార్వతితో మీ సాన్నిహిత్యం నచ్చట్లేదు వెళ్లిపోతున్నాను అని చెప్పొచ్చు. కానీ అలా చేయకుండా పక్కనే ఉండి నవ్వుతున్నట్లు నటించి, అదును వచ్చినపుడు వెన్నుపోటు పొడిచారు. అది నాకు చాలా బాధకలిగించిందని వర్మ తెలిపారు.

    ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు'

    నా తర్వాతి సినిమా ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు' అని ఓ ప్రశ్నకు వర్మ సమాధానం ఇచ్చారు. వర్మ చేసిన ఈ ప్రకటన మరింత ఆసక్తి రేకెత్తించింది. మొదట ‘కమ్మరాజ్యంలో కడప రౌడీలు' అని ప్రకటించిన వర్మ తన పొరపాటును సరిద్దిద్దకుని ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు' అని స్పష్టం చేశారు.

    ప్రజారాజ్యం 18 రెట్లు బలమైనది

    ప్రజారాజ్యం 18 రెట్లు బలమైనది

    తనకు రాజకీయ విశ్లేషణ తెలియదని, అందుకే రాజకీయాలు మాట్లాడదుచుకోలేదని వర్మ స్పష్టం చేశారు. ప్రజారాజ్యం పార్టీని బాహుబలితో పోల్చడానికి కారణం.... జనసేన 1 సీటు గెలిస్తే ప్రజారాజ్యం 18 సీట్లు గెలవడమే. 18 రెట్లు బలమైది కాబట్టే అలా అన్నట్లు వర్మ తెలిపారు.


    తనను బెజవాడలో అడుగు పెట్టకుండా ఫోన్లో ఒకరు ఆర్డర్ వేశారని, ఆ ఆర్డర్ ఎవరు వేశారో అందరికీ తెలుసని వర్మ వ్యాఖ్యానించారు.

    English summary
    Check out details: RGV Press Meet at Vijayawada about Lakshmi's NTR Movie. RGV next movie Kamma Rajyam lo Kadapa Redlu. Lakshmi's NTR is an Indian Telugu biographical drama film based on the life of former film actor and chief minister of undivided Andhra Pradesh, N. T. Rama Rao from the perspective of his second wife, Lakshmi Parvati as well as N. T. Rama Rao during his last days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X