»   » ‘చెలియా’ సెకండ్ ట్రైలర్ .... కార్తీ షాకింగ్ లుక్!

‘చెలియా’ సెకండ్ ట్రైలర్ .... కార్తీ షాకింగ్ లుక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కార్తి, అదితి రావు హైదరి జంటగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం 'చెలియా'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్ ట్రైలర్ రిలీజైంది. మొదట విడుదల చేసిన ట్రైలర్లో ఆర్మీ ఆఫీసర్‌గా నీట్ లుక్ తో కనిపించిన కార్తి.... సెకండ్ ట్రైలర్లో డిఫరెంట్ లుక్ తో కనిపించాడు.

ఉగ్రవాదుల నుండి తప్పించుకునే క్రమంలో కార్తి వారిలా వేషం వేసుకున్నట్లు... కొత్త లుక్ లో కనిపిస్తోంది. సెకండ్ ట్రైలర్ రిలీజ్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.


rn

సెకండ్ ట్రైలర్ ఇదే

మణిరత్నం, కార్తీ, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ తమిళంలో 'కాట్రు వేళయిదై' పేరుతో రూపొందుతున్న చిత్రాన్ని తెలుగులో ‘చెలియా' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అందమైన ప్రేమకథా చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు మణిరత్నం.


rn

ఫస్ట్ ట్రైలర్

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించిన ఈ చిత్రంలో పైలట్‌ గా కార్తి, డాక్టర్ గా అదితి రావు హైదరి నటిస్తోంది. వీరి మధ్య చిగురించిన ప్రేమ కథే ఈ చిత్రం. ప్రేమలోని భావోద్వేగాలను మణిరత్నం అద్భుతంగా చూపించబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.


rn

తెలుగులో దిల్ రాజు

తెలుగులో ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర బ్యానర్ విడుదల చేయనున్నారు. హిట్ సినిమాల నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకు మంచి పేరుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేస్తుండటం కూడా సినిమా మరో ప్లస్.


రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళంలో ఒకేసారి.... ఏప్రిల్ 7న విడుదల చేయబోతున్నారు. మద్రాస్ టాకీస్ బేనర్లో మణిరత్నం ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నారు.


English summary
Check out the theatrical trailer 2 of Mani Ratnam's Cheliyaa. An epic romantic drama starring Karthi and Aditi Rao Hydari.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu