»   » చెన్నై ఎఫెక్ట్: ఐఫా సినీ ఉత్సవం వాయిదా!

చెన్నై ఎఫెక్ట్: ఐఫా సినీ ఉత్సవం వాయిదా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ' వారు డిసెంబర్ 4న హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడింయలో దక్షినాది సినీ అవార్డుల ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషా చిత్రాల పరిశ్రమలకు సంబంధించి వివిధ విభాగాల్లో అవార్డులు ఇవ్వడంలో భాగంగా ఈ ఉత్సవం ప్లాన్ చేసారు. అయితే చెన్నై వరదల నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని వాయిదా వేసారు.

కమల్‌హాసన్‌, చిరంజీవి వంటి హేమాహేమీలు ముఖ్యఅతిథులుగా హైదరాబాద్‌లో ఈ ఉత్సవం ప్లాన్ చేసారు. మూడురోజులపాటు జరిగే ఈ వేడుకలో రామ్‌చరణ్‌, దేవీశ్రీప్రసాద్‌, శివరాజ్‌ కుమార్‌, జీవా, తమన్నా, శ్రియా తదితరులు డాన్స్‌ పెర్మామ్‌ చేయడానికి సిద్ధమయ్యారు. చెన్నై నగరం, తమిళనాడు భారీ వర్షాలతో తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో వేడుక జరుపడానికి సరైన సమయం కాదని భావించి వాయిదా వేసారు. చెన్నై పరిస్థితి మెరుగుపడ్డాక ఐఫా ఉత్సవం ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తారు.

 'ఐఫా' నామినేషన్స్‌

'ఐఫా' నామినేషన్స్‌


'ఐఫా ఉత్సవం -2015' పురస్కారాల కోసం ఉత్తమ చిత్రాల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పురస్కారాలకు సంబంధించిన నామి నేషన్లను ఐఫా పురస్కారాల కమిటీ ఇటీవల విడుదల చేసింది. తెలుగు ఉత్తమ చిత్రాల విభాగంలో 'శ్రీమంతుడు', 'బాహుబలి' పోటీ పడుతుండగా, ఉత్తమ నటుడు విభాగంలో ప్రభాస్‌, మహేష్‌బాబు, అల్లుఅర్జున్‌, ఎన్టీఆర్‌తోపాటు నాని బరిలో నిలిచారు అభిమానుల ఓటింగ్‌ ఆధారంగా ఈ పురస్కారాలను అందించనున్నారు.

'ఉత్తమ చిత్రం' బరిలో ఉన్న చిత్రాలు

'ఉత్తమ చిత్రం' బరిలో ఉన్న చిత్రాలు


'శ్రీమంతుడు', 'బాహుబలి', 'పాఠశాల', 'భలే భలే మగాడివోరు', 'ఎవడే సుబ్రమణ్యం'

'ఉత్తమ నటుడు' పురస్కారానికి పోటీ పడుతున్న హీరోలు

'ఉత్తమ నటుడు' పురస్కారానికి పోటీ పడుతున్న హీరోలు


ప్రభాస్‌ (బాహుబలి), మహేష్‌బాబు (శ్రీమం తుడు), అల్లుఅర్జున్‌ (సన్నాఫ్‌ సత్యమూర్తి), ఎన్టీఆర్‌ (టెంపర్‌), నాని (భలే భలే మగాడివోరు)
'

 ఉత్తమనటి' పురస్కార విభాగంలో..

ఉత్తమనటి' పురస్కార విభాగంలో..


తమన్నా (బాహుబలి), లావణ్య త్రిపాఠి (భలే భలే మగాడివోరు), నిత్యమీనన్‌ (మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు), శ్రుతిహాసన్‌ (శ్రీమంతుడు), మంచు లక్ష్మీ (దొంగాట)

 'ఉత్తమ దర్శకుడు' విభాగంలో..

'ఉత్తమ దర్శకుడు' విభాగంలో..


పూరీ జగన్నాథ్‌ (టెంపర్‌), కొరటాల శివ (శ్రీమంతుడు), రాజమౌళి (బాహుబలి), మహి.వి.రాఘవ్‌ (పాఠశాల), చందు మొండేటి (కార్తికేయ)

 'ఉత్తమ సహాయనటుడు' విభాగంలో..

'ఉత్తమ సహాయనటుడు' విభాగంలో..

సత్యరాజ్‌ (బాహుబలి), జగపతిబాబు (శ్రీమంతుడు), పవన్‌కళ్యాణ్‌ (గోపాల గోపాల), నవీన్‌చంద్ర (భమ్‌ భోలేనాథ్‌), పోసాని కృష్ణమురళి (టెంపర్‌)

'ఉత్తమ సహాయనటి' కేటగిరిలో

'ఉత్తమ సహాయనటి' కేటగిరిలో


రమ్యకృష్ణ (బాహుబలి), రితూవర్మ (ఎవడే సుబ్రమణ్యం), తులసి (శ్రీమంతుడు), అపూర్వ శ్రీనివాసన్‌ (జ్యోతిలక్ష్మీ), ప్రాచీ థాకీర్‌ (పటాస్‌)

 'ఉత్తమ సంగీత దర్శకుడు' విభాగంలో..

'ఉత్తమ సంగీత దర్శకుడు' విభాగంలో..

ఎం.ఎం.కీరవాణి (బాహుబలి), రఘుకుంచె, సాయికార్తీక్‌, సత్యమహావీర్‌ (దొంగాట), దేవిశ్రీప్రసాద్‌ (శ్రీమంతుడు), అనూప్‌ రూబెన్స్‌ (టెంపర్‌), (గోపాల గోపాల) బరిలో ఉన్నారు.

English summary
The International Indian Film Academy (IIFA) was supposed to host an award event titled IIFA Utsavam in Hyderabad later this weekend. But latest update reveals that the ceremony has been postponed due to the uncertainly calamity that has stuck Chennai and its surrounding areas.
Please Wait while comments are loading...