»   »  చెన్నై ఎక్స్‌ప్రెస్: 6 రోజుల్లోనే రూ. 200 కోట్లు!

చెన్నై ఎక్స్‌ప్రెస్: 6 రోజుల్లోనే రూ. 200 కోట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : షారుక్ ఖాన్, దీపిక పదుకొనె జంటగా రూపొందిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' మూవీ సూపర్ కలెక్షన్లతో గత రికార్డులు బద్దలు కొడుతూ బాక్సాఫీసు రేసులో ముందుకు సాగుతోంది. తాజాగా ఈచిత్రం రూ. 200 కోట్ల వసూళ్లను అధిగమించింది. కేవలం 6 రోజుల్లోనే ఇంత పెద్దమొత్తాన్ని కలెక్ట్ చేసిన చెన్నై ఎక్స్‌ప్రెస్.....గతంలో 10 రోజులకు పైగా సమయం తీసుకుని 200 కోట్లు వసూలు చేసిన సల్మాన్ 'ఏక్ థా టైగర్' రికార్డును అధిగమించింది.

ఆగస్టు 9న విడుదలైన చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3500లకు పైగా స్క్రీన్లలో విడుదల చేసారు. తొలి వీకెండ్‌లోనే ఈచిత్రం ఇండియన్ బాక్సాఫీసు వద్ద రూ. 100.42 కోట్లు వసూలు చేసింది. వీక్ డేస్ అయిన సోమ, మంగళ, బుధ వారాల్లో రూ. 34.37 కోట్లు వసూలు చేసింది. టోటల్‌గా గడిచిన ఆరు రోజుల్లో ఇండియాలో రూ. 134.79 కోట్లు రాబట్టింది.

చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రం 11 ఫారిన్ కంట్రీల్లో 700లకు పైగా స్క్రీన్లలో విడుదలైనంది. ఇంటర్నేషనల్ బాక్సాఫీసు వద్ద ఫస్ట్ వీకెండ్ ఈచిత్రం రూ. 50.47 కోట్లు వసూలు చేసింది. వీక్ డేస్‌లో మరో 20 కోట్లు రాబట్టి మొత్తం ఆరు రోజుల్లో ఫారిన్ కంట్రీల నుంచి రూ. 70.47 కోట్ల నెట్ రాబట్టింది.

ఇండియన్ బాక్సాఫీసు, ఇంటర్నేషనల్ బాక్సాఫీసు వద్ద మొత్తం కలిపి ఈచిత్రం గడిచిన ఆరు రోజుల్లో రూ. 205.26 కోట్లు వసూలు చేసింది. ఈ రోజు(ఆగస్టు 15) నేషనల్ హాలిడే కావడంతో ఈ రోజు ఇండియాలో దాదాపు రూ. 30 కోట్లకు పైగా వస్తాయని ట్రేడ్ నిపుణులు ఆశిస్తున్నారు. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రూ. 250 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టెన్మెంట్స్, యూటీవీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

English summary

 It's a raining rain for Shahrukh Khan-Deepika Padukone starrer Chennai Express, which has continued to keep the bells ringing at the worldwide Box Office. The collection of the Rohit Shetty-directed film has crossed Rs 200 crore mark in the global market in just six days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X