»   » పాకిస్తాన్‌లోనూ పంబరేపిన కలెక్షన్లు

పాకిస్తాన్‌లోనూ పంబరేపిన కలెక్షన్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu
ముంబై : షారుక్ ఖాన్, దీపిక పదుకొనె జంటగా రూపొందిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' మూవీ సూపర్ కలెక్షన్లతో గత రికార్డులు బద్దలు కొడుతూ బాక్సాఫీసు రేసులో ముందుకు సాగుతోంది. పాకిస్థాన్లోనూ ఈచిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పాకిస్థాన్‌లోని కరాచీలో కేవలం 8 స్క్రీన్లలో విడుదలైన ఈచిత్రం ఇప్పటి వరకు 40 మిలియన్ల రూపాయలు వసూలు చేసింది.

ఇండియాలో కలెక్షన్ల విషయానికొస్తే....విడుదలై తొలి 10 రోజుల్లో ఈచిత్రం 181.93 కోట్ల రూపయాలు వసూలే చేసింది. తొలి వారంలో దుమ్మురేపే కలెక్షన్లు సాధించి బాక్సాపీసు వద్ద నెం.1 స్థానంలో నిలిచిన ఈచిత్రం....రెండో వారంలో 'వన్స్ ఎపానె టైం ముంబై దొబారా' చిత్రం విడుదల కారణంగా 2 స్థానానికి పడిపోయింది.

ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్లను పరిగణలోకి తీసుకుంటే అత్యధిక గ్రాస్ కలెక్షన్ సాధించిన 4వ బాలీవుడ్ సినిమాగా కొనసాగుతోంది. గతంలో అమీర్ ఖాన్ నటించిన 3 ఇడియట్స్(రూ.202 కోట్లు), ఏక్ థా టైగర్(రూ. 199 కోట్లు), యే జవానీ హై దివానీ(188.57) కోట్లతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

షారుక్ ఖాన్, దీపిక పదుకొనె జంటగా నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టెన్మెంట్స్, యూటీవీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా మొత్తం సౌతిండియా నేపథ్యంతో సౌతిండియా బాక్సాఫీసు వద్ద కూడా సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి.

English summary
Bollywood superstar Shah Rukh Khan starrer Chennai Express has broken all box office records in Pakistan's biggest city after its release at the Eid weekend on August 9.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu