»   » సక్సెస్ పార్టీ: దర్శకుడిని ముద్దాడిన షారుక్ (ఫోటోలు)

సక్సెస్ పార్టీ: దర్శకుడిని ముద్దాడిన షారుక్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' చిత్రం ఇటీవల విడుదలైన భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం గత చిత్రాల రికార్డులను బద్దలు కొట్టి కలెక్షన్ల పంట పండించింది నిర్మాతలకు. ఈ నేపథ్యంలో నిన్న షారుక్ నివాసం 'మన్నత్'లో సినిమా యూనిట్ సభ్యులతో కలిసి గ్రాండ్‌గా సక్సెస్ పార్టీ నిర్వహించారు.

ఈ పార్టీకి సినిమాలో నటించిన ప్రముఖ నటీనటులతో పాటు, సాంకేతిక నిపుణులు కూడా హాజరయ్యారు. అంతా సందడిగా గడిపారు. సినిమాలోని పాటలకు ఆడి పాడారు. విందు వినోదాలతో మునిగి తేలారు. ఆ పార్టీతో షారుక్ నివాసంలో పండగ వాతావరణం నెలకొంది.

ముఖ్యంగా షారుక్ ఖాన్ పార్టీలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలోని పాటలకు స్టెప్పులేసి అందరినీ ఉత్సాహ పరిచాడు. చాలా కాలం తర్వాత షారుక్ భారీ హిట్ చవిచూడటంతో పట్టలేని ఆనందంలో ఉన్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.

సినిమా జీపులో...

సినిమా జీపులో...


చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలో ఉపయోగించిన జీపులో షారుక్‌తో పాటు మరికొందరు పార్టీకి ప్రాంగణానికి తరలి వచ్చారు. ఇది అందరినీ ఆకట్టుకుంది. ఈ జీప్ పార్టీకి ఓ కొత్త కళను తెచ్చిందని అంటున్నారంతా...

సన్మానం

సన్మానం


చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రం విజయంలో కీలకమైన దర్శకుడు రోహిత్ శెట్టిని, హీరో షారుక్ ఖాన్‌లను ఆ చిత్ర నిర్మాతలు శాలువాలు కప్పి సన్మానించారు. ఆ దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

స్టేజీపై...

స్టేజీపై...


చెన్నై ఎక్స్‌ప్రెస్ కథానాయకుడు షారుక్ ఖాన్ స్టేజీపై విద్యాబాలన్ భర్త సిద్ధార్థ రాయ్ కపూర్‌, మరికొందరు ప్రమఖులతో కలిసి స్టేజీపై ఉన్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

షారుక్ జోష్...

షారుక్ జోష్...


చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రం విజయంపై షారుక్ ఎంత సంతోషంగా ఉన్నాడో ఈ ఫోటో చూస్తే స్పష్టం అవుతోంది. ఈ సక్సెస్ పార్టీలో షారుక్ సీరియస్‌గా లీనమైపోయారు. సినిమాలోని సాంగులకు ఉత్సాహంగా స్టెప్పులేసారు.

షారుక్ ఖాన్

షారుక్ ఖాన్


చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలో తనదైన పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరించిన షారుక్.....తన నివాసం ‘మన్నత్'లో జరిగిన సక్సెస్ పార్టీలోనూ గెస్టులను తన పెర్ఫార్మెన్స్‌తో అలరించారు. ఆ దృశ్యాన్ని ఇక్కడున్న ఫోటోలో చూడొచ్చు.

దర్శకుడికి ముద్దు

దర్శకుడికి ముద్దు


చెన్నై ఎక్స్‌ప్రెస్ భారీ సక్సెస్‌తో ఉబ్బితబ్బిబయిన షారుక్.....ఆనందం ఆపుకోలేక దర్శకుడు రోహిత్ శెట్టిని ఇలా ముద్దాడాడు. ఈ మధ్య సరైన హిట్ లేక సతమతం అవుతున్నషారుక్ ఖాన్‌కు రోహిత్ శెట్టి భారీ సక్సెస్ ఇచ్చాడు.

రండి సందడి చేద్దాం...

రండి సందడి చేద్దాం...


రండి...అంతా కలిసి ఈ సంతోష సమయాన సందడి చేద్దాం. ఆనందంగా పార్టీ చేసుకుందాం అంటున్న షారుక్ హావ భావాలను ఈ ఫోటోల చూడొచ్చు. చాలా కాలం తర్వాత షారుక్ ఫేసులో ఇంత సంతోషం కనిపించిందని అంటున్నారు ఆయన సన్నిహితులు.

సన్నిహితులతో షారుక్

సన్నిహితులతో షారుక్


చెన్నై ఎక్స్‌ప్రెస్ సక్సెస్ పార్టీలో సన్నిహితులతో కలిసి షారుక్ ఖాన్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను షారుక్ తన ట్విట్టర్లో పోస్టు చేసారు.

లుంగా డాన్స్

లుంగా డాన్స్


చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో లుంగీ డాన్స్ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. సక్సెస్ పార్టీలో కూడా ‘లుంగీ డాన్స్‌' షో జరిగింది. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

షారుక్-రోహిత్

షారుక్-రోహిత్


నటుడు షారుక్ ఖాన్, దర్శకుడు రోహిత్ శెట్టి మధ్య కేవలం నటుడు, దర్శకుడు సంబంధం మాత్రమే కాకుండా మంచి స్నేహబంధం కూడా ఉంది. అందుకు నిదర్శనమే ఈ ఫోటో.

బాలీవుడ్ చరిత్రలో తనదైన మార్కు...

బాలీవుడ్ చరిత్రలో తనదైన మార్కు...


చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీసు చరిత్రలో తనదైన మార్కు సృష్టించింది. తన సినిమా ఇలాంటి అంచనాలను అందుకోవడం చాలా కాలం తర్వాత జరుగడంతో షారుక్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు.

సంతకాలు

సంతకాలు


చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీ సక్సెస్ పార్టీకి చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. గురువారం రాత్రంతా పార్టీ అదిరిపోయింది. ఈ సందర్భంగా పార్టీకి హాజరైన ప్రముఖులు ఇలా వైట్ బోర్డుపై సంతకాలు చేసారు.

అలుపే లేని షారుక్

అలుపే లేని షారుక్


గురువారం పొద్దుపోయే వరకు షారుక్ నివాసంలో పార్టీ జరిగింది. పార్టీలో ఆడి పాడిన షారుక్ పార్టీ ముగిసే వరకూ కూడా ఏమాత్రం అలుపే అనేదే లేకుండా కనిపించాడట. చివరకి గెస్టులంతా అలసి పోయినా...ఆయన మాత్రం ఉత్సాహంగానే ఉన్నారట.

English summary

 Chennai Express has been smashing all Bollywood records and Shahrukh Khan could not be happier than this. After all the promotion spree, the 47-year-old actor decided to celebrate this success of Chennai Express. King Khan threw a big bash for the entire cast and crew on Thursday, August 22 at his residence Mannat in Mumbai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu