రవితేజ ‘కిక్-2’లో విలన్ ఎవరో తెలుసా?
హైదరాబాద్: రవితేజ-రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కిక్-2'. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్ ఎవరో తెలిసి పోయింది. షారుక్ ఖాన్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెన్నైఎక్స్ ప్రెస్'చిత్రంలో విలన్ తంగబలి పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు నికితిన్ ధీర్ ఈ చిత్రంలో మెయిన్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
‘కిక్-2' చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ రాజ్ పాల్ యాదవ్ కూడా నటిస్తున్నాడు. . టిపికల్ కామిక్ టైమింగ్, వెరైటీ మేనరిజం, బాడీ లాంగ్వేజ్‌తో నవ్వులు పూయించడం రాజ్ పాల్ యాదవ్ ప్రత్యేకత. ఇప్పటి వరకు బాలీవుడ్ చిత్రాలకే పరిమితమైన రాజ్ పాల్ కిక్-2 ద్వారా టాలీవుడ్లోనూ నవ్వించడానికి వచ్చాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాలో అతని పాత్రను ప్రత్యేకంగా తీర్చి దిద్దాడని తెలుస్తోంది.

రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్' చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇపుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా రవితేజ హీరోగా నటించే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై హీరో కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు.
ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమని రవితేజ అంటున్నారు. 'కిక్'లో జంటగా నటించిన రవితేజ, ఇలియానా పాత్రల కొడుకు కథే ఈ 'కిక్ 2' అని దర్శకుడు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ...యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవితేజ మార్క్ ఎంటర్‌టైనర్‌తోపాటు సురేందర్ రెడ్డి, తమన్నా మ్యాజిక్ మళ్లీ రిపీట్ కానుంది. ఈ చిత్రం మే 28, 2015న విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. కథ:వక్కంతం వంశి, కెమెరా:మనోజ్ పరమహంస, సంగీతం:తమన్, నిర్మాత:నందమూరి కళ్యాణ్‌రామ్, దర్శకత్వం:సురేందర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











