»   » "రెడ్ లైట్ ఏరియా లు అవసరమే" అని చెప్పటానికట : ఇదేం సినిమా సామీ

"రెడ్ లైట్ ఏరియా లు అవసరమే" అని చెప్పటానికట : ఇదేం సినిమా సామీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

కోలీవుడ్ లో ఒక సినిమాపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సినిమా కాన్సెప్ట్ చూస్తే షాక్ తినాల్సిందే. కొన్ని సినిమాలు విడుదలయ్యాక ఆసక్తిని కలిగిస్తే.. మరికొన్ని మాత్రం ఆ సినిమా థీమ్ ను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అలాంటిదే 'శివప్పు ఎనక్కు పుడిక్కుం' కూడా. రెడ్ లైట్ ఏరియాలు అవసరం అని చెప్పడమే ఈ సినిమా కాన్సెప్ట్.

వీడియో

ఇలాంటి వివాదాస్పద అంశాన్ని ఎంచుకోవడానికే చాలా ధైర్యం కావాలి. ఇప్పుడా చిత్రాన్ని రిలీజ్ చేసేవరకూ తీసుకొచ్చేశారు కూడా. మహానగరాల్లో రెడ్ లైట్ ఏరియా లాంటివి ఉంటుంటాయి. ముంబయి.. కోల్ కతా మహానగరాల్లో వేశ్యలకంటూ ప్రత్యేకమైన రెడ్ లైట్ ఏరియా ఉండటం తెలిసిందే.మరి.. అలాంటి ఏరియా చెన్నై మహానగరంలో ఉండాలిగా అన్న కాన్సెప్ట్ తో ఒక చిత్రం రావటం ఇప్పుడు హాట్ చర్చగా మారింది.

 Chennai needs Red Light area - Sivappu Yenaku Pidikum

'ముంబైలో రెడ్ లైట్ ఏరియా ఉంది. చెన్నై లాంటి సిటీస్ లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎంతోమంది జీవనం సాగిస్తున్నారు. జనాభా పెరుగుతున్న కొద్దీ పడుపు వృత్తి కూడా పెరుగుతోంది. సమాజంలో ఇప్పుడు రేప్ సంఘటనలు పెరిగిపోతున్నాయి. వీటికి వ్యతిరేకంగా తెరకెక్కినదే శివప్పు ఎనక్కు పుడిక్కుం' అంటున్నాడు దర్శుకుడు. 'ఒక వేశ్య తన దగ్గరకు ఓ ఐదుగురు వ్యక్తుల మనస్తత్వాలను.. ఒక రచయితకు వివరించడమే ఈ సినిమా' అన్నాడు దర్శకుడు.

ఈ సినిమా అల్లాటప్పాదర్శకుడి నుంచిరావటం లేదు. ఇప్పటికే పలు జాతీయ.. అంతర్జాతీయ అవార్డుల్ని గెలుచుకున్న చిత్రాల్ని నిర్మించిన అనుభవం ఉన్న జే. సతీష్ కుమార్ ఈ సినిమాను తీస్తుండటంతో మరింత ఆసక్తి పెరిగింది. 'శివప్పు ఎనక్కు పుడిక్కుం' పేరిట తీస్తున్న ఈ సినిమా కథ గురించి చెబుతూ..

కాన్సెప్ట్ భిన్నమైనా.. అశ్లీలత ఎంత మాత్రం ఉండదని చెబుతున్నారు. . మహానగరాలకు రెడ్ లైట్ ఏరియాలు అవసరమనే వివాదాస్పద లైన్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు అందరి దృష్టి పడుతోంది. అయితే.. ఈ సినిమాలో ఎలాంటి అశ్లీల సన్నివేశాలు ఉండవని ఒకటికి నాలుగుసార్లు చెబుతున్నారు ఈ చిత్ర దర్శకుడు యురేక. మరీ.. సినిమా విడుదలయ్యాక ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

English summary
Sivappu Enaku Pidikkum, directed by Youreka is a controversial film from producer J. Sathish Kumar’s banner. Even though the film had been completed two and a half years ago, it is yet to see the light of the day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu