»   »  అపోలో ప్రకటనల్లో రామ్ చరణ్ భార్య

అపోలో ప్రకటనల్లో రామ్ చరణ్ భార్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా కోడలు అవ్వకముందే ఉపాసన అపోలో లైఫ్ విభాగానికి డైరెక్టర్, అలాగే బి పాజిటివ్ అనే మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా చాలా పాపులర్ ..అయితే తాజాగా అపోలో లైఫ్ వారు తయారు చేస్తున్న పలు రకాల ప్రొడక్ట్స్‌కి టీవీలో యాడ్ వస్తుంది.గతంలో కేవలం టాప్ రిచ్ క్లాస్ సర్కిల్స్‌లోనే అపోలో డైరెక్టర్‌గా పాపులర్ అయిన ఉపాసన ఆ తర్వాత మెగా ఇంటి కోడలుగా తెలుగు వాళ్ళకు దగ్గరైంది. 

Cherry's wife, Upasana to appear in Apollo ad


అయితే అపోలో వారి ప్రకటనల్లోనూ ఇప్పుడు ఉపాసన నటిస్తోంది. ఏంటి మెగా కోడలు యాడ్‌లో నటిస్తోందా? అని ఆశ్చర్యపోతున్నారా. నిజానికి ఈ యాడ్‌లో ఉపాసన డైరెక్టుగా కనిపించరు, ఆడ్ చివరలో ఉపాసన ఫోటో‌తో పాటు సైన్ కూడా వేసి ఈ ప్రొడక్ట్స్‌ని వాడండి అంటూ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.

ఇలా అడ్ కి ఒక స్టార్ రేంజ్ కి తీసుకు వచ్చారు. మొత్తంగా ఈ రకంగా మెగా కోడలు ఉపాసన కూడా యాడ్స్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ విధంగా చూస్తే రామ్ చరణ్ ఉపాసనలు కలిసి అపోలో కోసం ప్రకటన కోసం కలిసి నటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే అపోలో లో జరిగే కార్యక్రమాలకి చిరు ని ముఖ్య అతిథిగా తీసుకువెళుతున్నారు. చరణ్ కూడా తాను చేయ బోయే సహాయ కార్యక్రమాలని అపోలో తో కలిసి చెయాలనే ఆలోచనల్లో ఉన్నాడు..

English summary
Actor Ramcharan Tej's wife, Upasana Kamineni, will appear in an ad for Apollo Hospitals.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu