హాట్ న్యూస్: రవితేజ రీమేక్ కు చేతన్ భగత్ స్క్రీన్ ప్లే
ఇక ఈ విషయమే ఛేతన్ భగత్ ట్వీట్ లో... ' ఈ విషయం మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. సల్మాన్ ఖాన్ - సాజిద్ నదియావాలా కాంబినేషన్లో రానున 'కిక్' సినిమాకి స్క్రీన్ ప్లే రాయబోతున్నాను. సాజిద్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం కావడంతో ఇంకా టఫ్ గా స్క్రీన్ ప్లే కావాలని నన్ను అడిగారు. అందుకోసం నేను ముందు 'కిక్' ఒరిజినల్ అయిన తెలుగు వెర్షన్ చూడబోతున్నాను. భారీ అంచనాలున్న ఈ సినిమాలో కొన్ని మార్పులు కూడా చేస్తాను. నాకు మీ అందరి ప్రోత్సాహం ఉండాలని కోరుకుంటున్నాను' అన్నారు.
'కిక్' సల్మాన్‌ఖాన్ హీరోగా సాజిద్‌నదియావాలా దర్శకత్వంలో అదే పేరుతో హిందీలో రీమేక్ అవుతోంది. హిందీ నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేస్తున్నారు. అలాగే కిక్ తమిళ వెర్షన్ ని ఎడిటర్ మోహన్ కుమారుడు జయం రవితో నిర్మించారు. అయితే ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద పెద్ద ప్లాప్ గా నమోదయింది. తమన్నా అందచందాలు కూడా సినిమాని నిలబెట్టలేకపోయాయి. అయితే ఈ కిక్ రీమేక్ పై సల్మాన్ ఖాన్ బాగా నమ్మకంగా ఉన్నారు. తాను చేసిన 'పోకిరి', 'రెడీ' రీమేక్స్ హిట్టవటంతో ఈ చిత్రం కూడా అదే రేంజిలో వర్కవుట్ అవుతుదని నమ్ముతున్నాడు.


Click it and Unblock the Notifications












