»   » ఎఫైర్స్: ప్రెస్‌మీట్లో అందరి ముందు హీరోయిన్ పరువు తీసాడు!

ఎఫైర్స్: ప్రెస్‌మీట్లో అందరి ముందు హీరోయిన్ పరువు తీసాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్.... దర్శకుడు, నటుడు పర్హాన్ అక్తర్‌ మధ్య ఎఫైర్ ఉన్నట్లు బాలీవుడ్లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఫంక్షన్లో శ్రద్ధ కపూర్ కోసం పర్హాన్, ఆదిత్యరాయ్ కపూర్ కొట్టుకున్నట్లు కూడా వార్తలొచ్చాయి. అయితే ఈ రూమర్స్‌కు చెక్ పెడుతూ ఆదిత్యతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పకనే చెప్పాడు పర్హాన్.

కాగా... శ్రద్ధాకపూర్-అర్జున్ కపూర్ జంటగా నటించిన 'హాఫ్ గర్ల్‌ఫ్రెండ్' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవల ముంబైలో జరిగింది. ఈ సినిమా చేతన్ భగత్ నవల ఆధారంగా అదే పేరుతో తెరకెక్కుతోంది. అయితే ఈ ఈవెంటులో చేతన్ భగత్ మూలంగా శ్రద్దా కపూర్ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు ఆమె పరువు పోయినంత పనైంది.

పరువు తీసాడు

పరువు తీసాడు

ఈ సినిమా కథ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మధ్య ఉండే రిలేషన్ చుట్టూ తిరుగుతుంది. ప్రెస్ మీట్ లో ఇందుకు సంబంధించి మీడియా వారు పలు ప్రశ్నలు సంధించారు. ‘బాయ్ ఫ్రెండ్' గురించి ప్రశ్న ఎదురువ్వగానే చేతన్ భగత్ నువ్వైతే ఈ విషయమై బాగా చెప్పగలవు.... నీ మీద ఈ మధ్య ఇలాంటి వార్తలు బాటగా నడుస్తున్నాయి కదా అంటూ మైకు ఆమెకు పాస్ చేసాడు. పరోక్షంగా శ్రద్ధా కపూర్ రియల్ లైఫ్ ఎఫైర్లను ఇక్కడ చేతన్ భగత్ ప్రస్తావించడంతో ఆమె పరువు పోయినట్లయింది.

శ్రద్ధా ముఖం మారిపోయింది

శ్రద్ధా ముఖం మారిపోయింది

చేతన్ భగత్ చేసిన పనికి శ్రద్ధా కపూర్ ముఖం ఒక్కసారిగా చిన్నబోయింది. అయితే వెంటనే శ్రద్ధా కపూర్ తేరుకుని..... ‘నేను అర్జున్ కపూర్ హాఫ్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టే ఇలాంటి వార్తలు నడుస్తున్నాయి' అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది.

శ్రద్ధా కపూర్ ను కాపాడే ప్రయత్నం చేసిన అర్జున్

శ్రద్ధా కపూర్ ను కాపాడే ప్రయత్నం చేసిన అర్జున్

అయితే వెంటనే హీరో అర్జున్ కపూర్ కల్పించుకుని ఈ వివాదం పెద్దదిగా కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసారు. మీడియా వారి ఫోకస్ శ్రద్ధా కపూర్ రియల్ లైఫ్ ఎఫైర్స్ అంశాల వైపు వెళ్లకుండా నిరోధించగలిగాడు

సహ జీవనం గురించి శ్రద్దా కపూర్

సహ జీవనం గురించి శ్రద్దా కపూర్

శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ.... హాఫ్ గర్ల్ ప్రెండ్ సినిమా లైవ్ ఇన్ రిలేషన్ షిప్ గురించి ఉంటుంది. రియల్ లైఫ్ లో మా ఫ్రెండ్స్ చాలా మంది ఇలాంటి రిలేషిప్ లో ఉన్నప్పటికీ ఎవరూ పూర్తి కమిట్మెంటుతో లేరు. మన ముందు జనరేషన్, మన పేరెంట్స్ ఒకరినొకరు యాక్టెప్ట్ చేసుకునేవారు, ఒకరి నిర్ణయాలను ఒకరు గౌరవించుకునే వారు.... లైఫ్ ఇన్ రిలేషన్ షిప్ లో కూడా అది ఉంటే హ్యాపీగా ఉంటుంది. మా పేరెంట్స్ గురించి ఇలాంటి విషయాలు ఓపెన్ గానే మాట్లాడతాను అని శ్రద్ధా కపూర్ తెలిపారు.

హాఫ్ గర్ల్ ఫ్రెండ్ అంటే అర్థం

హాఫ్ గర్ల్ ఫ్రెండ్ అంటే అర్థం

హాఫ్ గర్ల్ ఫ్రెండ్, లేదా హాఫ్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఏమిటి అనే పదానికి అర్థం ఏమిటి? అని మీడియా వారు ప్రశ్నించగా.... శ్రద్ధా కపూర్ స్పందిస్తూ ఫ్రెండ్ కంటే ఎక్కువ రిలేషన్ మెయింటేన్ చేస్తూ, బాయ్ ఫెండు కంటే తక్కువ రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తూ మిడిల్ లో ఉండే వారిని హాఫ్ గర్ల్/బాయ్ ఫ్రెండ్ అంటారని శ్రద్ధా కపూర్ చెప్పుకొచ్చారు.

సినిమాలో అలాంటిదేమీ చేయలేదు

సినిమాలో అలాంటిదేమీ చేయలేదు

గత సినిమాల్లో శ్రద్దా కపూర్ పాటల పాడారు. అయితే ఈ సినిమాలో పాటలు పాడలేదుని, అయితే ఈ చిత్రంలో బాస్కెట్ బాల్ ఆడాను. అదొక కొత్త అనుభూతి. షూటింగ్ సమయంలో బాగా ఎంజాయ్ చేసామని శ్రద్ధ కపూర్ తెలిపారు.

మే 19న రిలీజ్

మే 19న రిలీజ్

చేత్ భగత్ నటించిన హాఫ్ గర్ల్ ఫ్రెండ్ నవల ఆధారంగా అదే పేరుతో సినిమా తెరకెక్కుతోంది. మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 19న విడుదలకు సిద్దం అవుతోంది.

English summary
hraddha & Arjun attended the trailer launch of Half Girlfriend along with Chetan Bhagat and you won't believe, one statement of Mr Bhagat made Shraddha all embarrassed at the event! Here's what happened: As the film revolves around the commmitment, boyfriend/girlfriend, reporters were bound to ask some related question to the star cast of the film! And as soon as the ‘boyfriend question' directed towards Shraddha, Chetan passed on the mike to her saying, "Bolo Shraddha...Tumhara toh waise bhi bahut chal raha hai....matlab khabrein chal rahi hai".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu