స్టార్ సింగర్ కు ఛోటా షకీల్ బెదిరింపులు

చోటాషకీల్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కుడిభుజం వంటివాడనే సంగతి తెలిసిందే. దీనిపై సోనూ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత నెలలో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌కు కూడా చంపేస్తామని బెదిరిస్తూ ఆగంతకుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే.
వారు పుజారీ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తులయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరో నిర్మాత కరణ్ జోహార్ కూడా ఇలాంటి బెదిరింపులనే ఎదుర్కొంటున్నాడు. 1990 దశకం నుంచి బలీవుడ్ సీనీ పరిశ్రమ మాఫియా నుంచి బెదిరింపుల్ని ఎదుర్కొంటోంది. సినీ ప్రముఖులకు ఫోన్లు చేసి బెదిరించడం, భారీగా సొమ్ము వసూలు చేయడం ఇక్కడ సర్వసాధారణమైపోయింది.
సింగర్ సోనూ నిగమ్‌లో ఓ మంచి నటుడు కూడా ఉన్నాడు.ఆయన తన ముఖంలో వివిధ భావాలను చక్కగా పలికించగల్గుతాడు. దీన్ని గుర్తించి ఆయనకు మొదట ఓ సినిమాలో రొమాంటిక్ పాత్రలో నటించే అవకాశం దక్కింది. కానీ ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. దీంతో కొంతకాలం పాటు నటనకు విరామాన్నిచ్చారు సోనూ. కానీ ఆయనకు సినిమాల్లో నటించేందుకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈసారి రొమాంటిక్ పాత్రలకంటే కామెడీ రోల్స్ చేయాలని ఈ సింగర్ నిర్ణయించుకున్నారు.
దీంతో పాటు తనకు అవకాశాలు వచ్చిన నాలుగు సినిమా స్క్రిప్ట్‌లను ఆయన పరిశీలిస్తున్నారు. ఇందుకోసమే ఆయన స్క్రిప్ట్‌లను పరిశీలించి ఆచితూచి అడుగువేయాలని భావిస్తున్నారు.'సినిమాల్లో నటించి అభిమానులకు మరింత దగ్గరవ్వాలని కోరుకుంటున్నాను. మన దేశంలో సినిమా హీరోలకున్నా క్రేజ్ మరెవ్వరికీ లేదు. సింగర్‌గా, మ్యూజీషియన్‌గా ఇదివరకే పేరుతెచ్చుకున్నప్పటికీ సినీ నటునిగా నా ప్రతిభాపాటవాలను చాటాలని అనుకుంటున్నాను' అని సోనూ నిగమ్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











