twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రైలర్ చూస్తుంటే..ఓపినింగ్స్ తెచ్చేలా ఉంది (వీడియో లింక్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : ట్రైలర్ ను బట్టి ఓపినింగ్స్, క్రేజ్ క్రియేట్ అయ్యే రోజులు వచ్చేసాయి. దాంతో దర్శక,నిర్మాతలు తమ చిత్రం ఫస్ట్ ట్రైలర్ మీదే ఎక్కువ కృషి చేస్తున్నారు. ట్రైలర్ హిట్ అయ్యితే థియోటర్ వద్ద రిలీజ్ రోజు మార్నింగ్ షోకు జనం కిట కిటలాడతారు. ఇక ఈ మధ్య కాలంలో మినిమం ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోతున్న సిద్దార్ధ కొత్త చిత్రం చిక్కడు..దొరకడు ట్రైలర్ విడుదల అయ్యింది. ట్రైలర్ చూసిన వాళ్లు సినిమా బాగానే ఉండే అవకాసం ఉందంటున్నారు. అందులోనూ దర్శకుడు గత చిత్రం పిజ్జా హిట్ కావటం తో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతాయి. మీరు కూడా ట్రైలర్ చూసి మీ అభిప్రాయం క్రింద కామెంట్ రూపంలో చెప్పండి.

    <center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/C03TpMAzd5M" frameborder="0" allowfullscreen></iframe></center>

    తమిళంలో 'జిగర్‌తాండా' చిత్రాన్ని తెలుగులో 'చిక్కడు దొరకడు' అనే పేరుతో రిలీజ్‌ చేస్తున్నారు. 5స్టార్‌ ఆడియో అధినేత ఎస్‌.కదిరేశన్‌ సమర్పణలో శ్రీ మీనాక్షి క్రియేషన్స్‌ బ్యానర్‌పై తమిళంలో కార్తిక్‌ సుబ్బురాజ్‌ దర్శకత్వంతో తెరకెక్కింది. అదే బ్యానర్‌లో కదిరేశన్‌ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో సిద్దార్ధ, లక్ష్మీమీనన్‌ జంటగా నటిస్తున్నారు. ఆడియో రంగంలో 19 సంవత్సరాలు అనుభవం వున్న కదిరేశన్‌ తన బ్యానర్‌పై గతంలో తమిళంలో నిర్మించిన 'పొల్లాదవన్‌, ఆడుగలం...' తదితర చిత్రాలన్నీ విజయవంతంగా ప్రదర్శింపబడటమే కాకుండా ఎన్నో అవార్డులను, జాతీయ అవార్డులను కూడా సాధించాయి.

    Chikkadu Dorakadu Theatrical Trailer

    ఇప్పుడు సిద్దార్ధ, లక్ష్మీమీనన్‌, బాబీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని కర్నూలు, హైదరాబాద్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో, శంకర్‌ 'ఐ' సినిమాకు వాడిన అత్యాధునిక టెక్నాలజీ కెమెరాని ఈ చిత్రానికి ఉపయోగించారు. రెండు సంవత్సరాలపాటు ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించారు.

    ఈ సినిమాకి హైలైట్‌ అని చెప్పుకునే అంశం ఈ సినిమా దర్శకుడు. తమిళ్‌లోనే కాక తెలుగులో కూడా తన మొదటి చిత్రంతోనే కమర్షియల్‌ సక్సెస్‌ని సాధించిన 'పిజ్జా' సినిమా దర్శకుడు కార్తిక్‌ సుబ్బురాజ్‌ ఈ 'చిక్కడు దొరకడు' చిత్రానికి దర్శకత్వం వహించాడు. అదే మ్యూజిక్‌ డైరెక్టర్‌ సంతోష్‌ నారాయణ్‌, అదే టీమ్‌ ఈ చిత్రానికి పని చేసారు.

    సిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఒక యంగ్‌స్టర్‌ లైఫ్‌లో మొదలై కర్నూలు రౌడీషీటర్స్‌ ప్రపంచాన్ని టచ్‌ చేస్తూ, మంచి లవ్‌స్టోరీ, కామెడీ క్యారెక్టర్స్‌ మధ్య ట్రావెల్‌ అయి చిత్రమైన మలుపులు తిరుగుతూ చివరికి ఎవరూ ఊహించని క్లయిమాక్స్‌లో ఎండ్‌ అవుతుంది. ఆడియన్స్‌ ఒక కొత్త అనుభూతిని కలిగించే ఒక మ్యూజికల్‌ గ్యాంగ్‌స్టర్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తమిళ్‌, తెలుగు రెండు భాషల్లోనూ జులై చివరివారంలో విడుదల చేయబోతున్నారు.

    మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, చంద్రబోస్‌, కెమెరా: సంతోష్‌ నారాయణ్‌, ఎడిటింగ్‌: వివేక్‌ హర్షన్‌, బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎ.ఎన్‌.బాలాజీ (సూపర్‌గుడ్‌ మూవీస్‌), నిర్మాత: కదిరేశన్‌, దర్శకుడు: కార్తిక్‌ సుబ్బురాజ్‌.

    English summary
    Tamil director Karthik Subbaraj who entered on film scene with stunning debut Pizza is now directing a film in Tamil with actor Siddharth in the lead. The film is now in the last leg of shoot. Suresh Kondeti is set to release the film in Telugu simultaneously with the Tamil version. V S Rami Reddy and Suresh Kondeti bought the movies rights. Lakshmi Menon is the heroine.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X