twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలల చిత్రోత్సవంలో ‘ఐయాం కలామ్‌’

    By Srikanya
    |

    బాలల చలన చిత్రోత్సవంలో ప్రజాదరణ పొందిన 'ఐయాం కలామ్‌" 'చిల్లర్‌ పార్టీ", 'స్టాన్లీ కా డబ్బా" చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలను ప్రదర్శించనున్నట్టు కమిటీ వెల్లడించింది. నవంబర్‌ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు బాలల చిత్రోత్సవం జరిపేందుకు హైదరాబాద్‌ వేదికగా మారనుంది. ఈ చిత్రోత్సవంలో 44 దేశాలు పాల్గొంటున్నాయి. 170 చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఇరాన్‌ చిత్రం 'ది అదర్‌", ఫ్రాన్స్‌ 'టేల్స్‌ ఆఫ్‌ ది నైట్‌" చైనా చిత్రం ' ది స్టార్‌ అండ్‌ ది సీ", డెన్మార్క్‌ చిత్రం ' ది గ్రేట్‌ బేర్‌" చిత్రాలు బాలల పండుగలో పాలు పంచుకోనున్నాయి. 17వ ప్రపంచ బాలల చిత్రోత్సవాన్ని నవంబర్ 14 నుంచి 20 వరకు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ చైర్‌పర్సన్ నందితా దాస్ వెల్లడించారు.

    ప్రతి రెండేళ్లకొకసారి నిర్వహించే ఈ చిత్రోత్సవాన్ని ఈ సారి హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. వారం రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనలో 40 దేశాల్లో అవార్డులు సాధించిన చిన్నపిల్లల సినిమాలు 100కు పైగా ప్రదర్శిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాల దర్శకుల్ని కూడా పరిచయం చేయబోతున్నామని చెప్పారు. రాష్ట్ర చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ తరపున ఈ చిత్రోత్సవానికి అన్నివిధాలా తోడ్పాటును అందిస్తున్నట్లు మంత్రి అరుణ తెలిపారు. హైదరాబాద్‌లో గతంలో ఈ చిత్రోత్సవం జరిగినప్పుడు పలు సినిమా హాళ్లలో ప్రదర్శనలు జరిగాయని, ఫలితంగా చిన్నపిల్లలు అటు ఇటు తిరగటానికి ఇబ్బంది పడ్డారని ఆమె అన్నారు. ఇప్పుడు అలాంటి సమస్య తలెత్తకుండా శిల్పారామం లాంటి చోట్లను పరిశీలిస్తున్నామని తెలిపారు.

    English summary
    The popular films like ‘Chillar Party’, ‘I Am Kalam’ and ‘Stanley Ka Dabba’ will be showcased in the upcoming 17th International children’s film festival among others.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X