Don't Miss!
- Sports
IND vs NZ: రెండో టీ20లో భారత్ గెలవాలంటే ఈ మూడు మార్పులు చేయాల్సిందే!
- News
మరోసారి హైదరాబాద్‌లో కుంగిన రోడ్డు: గుంతలోకి టిప్పర్, ముగ్గురికి గాయాలు
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
ఎప్పటికైనా నిజం గెలుస్తుంది.. వైరముత్తు, రాధారవిని టార్గెట్ చేసిన చిన్మయి
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రియా రమణి పేరు మార్మోగిపోతోంది. కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ గతంలో దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో జర్నలిస్టు ప్రియా రమణిని ఢిల్లీ హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించడంతో దేశంలో మహిళామణులు, స్త్రీవాదులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీటూ ఉద్యమంలో భాగంగా ఎంజే అక్బర్‌పై ప్రియా రమణి చేసిన ఆరోపణల గురించి అందరికీ తెలిసిందే. వాటిపై ఎంజే అక్బర్ పరువునష్టం కేసు వేయడం, నేడు ప్రియా రమణికి అనుకూలంగా తీర్పు రావడంతో చిన్మయి హర్షం వ్యక్తం చేసింది. తాజాగా ఓ వీడియోను షేర్ చేస్తూ ఆనంద భాష్పాలను కార్చింది..

మీటూ ఆరోపణలు..
2018లో మీటూ ఉద్యమంలో భాగంగా ప్రియా రమణి అనే జర్నలిస్ట్.. ఎంజే అక్బర్‌పై ఆరోపణలు చేసింది. ఆయన ఓ పత్రికకు ఎడిటర్‌గా పని చేసే సమయంలో తనను లైంగికంగా వేధించినట్లు ఆమె ఆరోపించింది. ఆమె ఆరోపణలు సెన్సేషనల్ అయిన తరువాత మరో 20 మంది మహిళలు బయటకు వచ్చారు. ఇలా ఆయన వ్యవహారం దేశాన్ని కుదిపేసింది.

పరువునష్టం..
ఎంజే అక్బర్ తనపై వచ్చిన ఆరోపణల కారణంగా మంత్రి పదవికి రాజీనామ చేశాడు. మొదటగా తనపై ఆరోపణలు చేసిన ప్రియా రమణిపై పరువునష్టం దావా కేసును వేశారు. తాజాగా ఆ కేసుకు సంబంధించిన తీర్పు నేడు వచ్చింది.

దశాబ్దాల తరువాత..
ఈ మేరకు అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాండే ఈ తీర్పు ఇచ్చారు. లైంగిక వేధింపులు ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది. దశాబ్దాల తరువాత కూడా ఫిర్యాదులు చేసే హక్కు మహిళలకు ఉందని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.

చిన్మయి ఎమోషనల్..
ప్రియా రమణి కేసు ద్వారా, అందులో వచ్చిన తీర్పు ద్వారా ఇంకా న్యాయం బతికే ఉందని తెలుస్తోంది. నిజం ఎప్పటికైనా గెలుస్తుందన్న ఆత్మ విశ్వాసం నెలకొందని చెబుతూ చిన్మయి ఏడ్చేసింది. అయితే ప్రియా రమణి పోరాటం ఎందరిలోనో స్ఫూర్తినింపిందని చెప్పుకొచ్చింది.

ఎప్పటికైనా నిజమే..
నిజం ఎప్పటికైనా నిజమే.. పదేళ్లు, పదిహేనేళ్ల తరువాత చెప్పినా కూడా నిజమే.. ఇప్పటికైనా రాధారవి, వైరముత్తులను సపోర్ట్ చేసేవారు కళ్లు తెరవండి.. వారిని సపోర్ట్ చేస్తున్న బీజేపీ, లెఫ్ట్, రైట్, సెంటర్ వింగ్‌లు అందరూ మారండని చిన్మయి ఎమోషనల్ అయింది. ఎంతో మంది నన్ను ఎన్నో రకాలుగా బాధలు పెట్టారు.. అయినా ఈ తీర్పు నాలాంటి ఎంతో మందిలో ధైర్యాన్ని నింపిందంటూ చిన్మయి పేర్కొంది.