Don't Miss!
- News
మావోయిస్టుల ఘాతుకం: ఫ్యామిలీ ముందే గొడ్డళ్ళతో నరికి బీజేపీ నేత దారుణ హత్య
- Finance
Telangana Budget: తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు.. సంక్షేమంలో ముందుకే..
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Sports
SA20 : దంచికొట్టిన సన్రైజర్స్ బ్యాటర్.. చిత్తుగా ఓడిన క్యాపిటల్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
తండ్రితో పడుకున్నావ్ అంటోంది.. తప్పని తెలిసినా సరే.. చిన్మయి ఎమోషనల్
దక్షిణాదిన క్యాస్టింగ్ కౌచ్ మీటూ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకొచ్చింది సింగర్ చిన్మయి. కోలీవుడ్ స్టార్ రైటర్ వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తనను చిన్నతనంలో లైంగికంగా వేధించాడని, అసభ్యంగా తాకడంటూ ఆరోపణలు చేసింది. అలాగే సింగర్ కార్తీక్ అరాచకాలను కూడా బయటపెట్టేసింది. అలా చిన్మయి ఎన్నెన్నో సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

సోషల్ మీడియాలో అలా..
ఎంతో మంది ఆడవాళ్లకు చిన్మయి గొంతుకలా మారింది. తాము చెప్పుకోలేని విషయాలు, బాధ పడ్డ సంఘటనల గురించి చిన్మయితో చెప్పుకుంటారు. తమ బాధనంతా ఆమె వద్ద వెళ్లగక్కుంటారు. అలా చిన్మయికి రోజుకు కొన్ని వందల మంది ఆడవాళ్లు తమ వేధింపుల గురించి చెబుతుంటారు.

తాజాగా ఇలా..
అయితే చిన్మయి తాజాగా తనకు వచ్చిన ఓ మెసెజ్ గురించి చెప్పుకొచ్చింది. అందులో ఒక అమ్మాయి తన తల్లి గురించి చెప్పుకొచ్చింది. ఆ తల్లికి కోపం వచ్చినప్పుడల్లా కూడా తన తండ్రితో సంబంధం ఉంది.. పడుకున్నావ్ అంటూ నీచంగా మాట్లాడుతుందట. అమ్మ అలా చిన్నతనం నుంచి తిడుతూనే వస్తోందట.

చిన్మయి రియాక్షన్..
ఈ విషయంపై నేను స్పందించాల్సిందే.. కచ్చితంగా మాట్లాడాల్సిందే. ఇలాంటి ఎన్నో సందేశాలు నాకు వస్తున్నాయి.ఇలాంటి ఘటనల వల్ల మనకు మన శరీరమన్నా, సెక్స్ అన్నా, రొమాన్స్ అన్నా చిరాకు పుడుతుంది. సాధారణ అమ్మాయిలమైన మనకు ఇలాంటివే ఎదురవుతుంటాయి. వేశ్యగా ముద్ర వేస్తుంటారు. ఇలా మమ్మల్ని తిట్టకుండా ఉండగలరా? అది మీకు సాధ్యమేనా? అని చిన్మయి ప్రశ్నించింది.

తప్పని తెలిసినా సరే...
ఈ చెత్తనంతా చదివితే.. అది తప్పని మీకే తెలుస్తోంది. మాతా పిత్ర గురు దైవం అనే చెప్పే మాటల్లోనే అంతా దాగి ఉంది. అలా చెప్పి వారిని గొప్ప వారిగా చిత్రీకరించి మనల్ని కట్టి పడేస్తున్నారు. అది మన కర్మ అనుకుని అంతా భరించాల్సి వస్తుంది. అది తప్పని తెలిసినా కూడా నువ్ ఓ మహిళవి అయినందుకు మైనర్‌వి అయినందుకు దురదృష్టవశాత్తు వాటన్నంటిని భరించాల్సిందే.

మంచివాడిని చూసుకుని భర్తగా ఎంచుకోవాలి.
మనల్ని వారు కన్నారు కదా? అని అన్నీ భరించాల్సిన పని లేదు. మనకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చే వరకు అలాంటి తప్పవు. కానీ ఇండియాలో అది జరగదు. చదువులు అయినా కాకపోయినా వెంటనే పెళ్లిళ్లు చేసేస్తారు.. ఆ వెంటనే పిల్లల్ని కనాల్సి వస్తుంది.. అందుకే ఇలాంటి వాతావరణంలో అలాంటి తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఉంటే.. మంచివాడిని చూసుకుని భర్తగా ఎంచుకోవాలి. అలా తిట్టడం మరీ దారుణం అని చిన్మయి చెప్పుకొచ్చింది.