twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెటైర్ కామెడీ (చిన్న సినిమా ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'దానం చేసే వారిలో స్వార్థం వుండకూడదు. ఏదైనా ఆశించి దానధర్మాలు చేస్తే తర్వాత తీవ్రమైన దుష్ఫరిణామాల్ని ఎదుర్కోవాల్సి వుంటుంది' అనే కాన్సెప్ట్ ఆధారంగా తయారైన చిన్న సినిమా ఈ రోజు విడుదల అవుతోంది. ఈ సినిమాలో చక్కటి సందేశంతో పాటు తాత్వికత మేళవించి వుంటుంది. రామాలయం పేరు గల అనాథ శరణాలయం సినిమాలో ప్రధానాంశంగా వుంటుంది అని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.

    కథ ప్రకారం అమెరికా పిచ్చోడు రాము (అర్జున్‌ కల్యాణ్‌). తన కలని నిజం చేసుకొనేందుకు అమెరికా వెళ్తాడు. అక్కడ ఓ సూపర్‌ మార్కెట్‌లో పని చేస్తుంటాడు. జానకి (సుమోనచందా) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. పదిమందికీ సాయపడాలనే మనస్తత్వం ఆమెది. వీరిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? జానకితో జీవితం పంచుకోవాలనుకొన్న రాము ఆశలు నెరవేరాయా లేదా? అనేది తెరపైనే చూడాలి.

    Chinna Cinema

    దర్శకుడు మాట్లాడుతూ ''దానం చేసేవాడికి స్వార్థం ఉండకూడదు అనే సందేశంతో తెరకెక్కిన కథ ఇది. గీత వెనకాల తిరిగే గోపి, సినిమా కలలు కనే ప్రకాష్‌, నర్తకి మంజరి పాత్రలు చక్కటి వినోదాన్ని పంచిపెడతాయి. ఇందులోని ప్రతి పాత్ర మనకు నిజ జీవితంలో ఎక్కడో ఒకచోట తారసపడినట్టుగా ఉంటుంది. ఈ కథ సింహభాగం అమెరికాలో సాగుతుంది''అన్నారు.

    అలాగే సినిమాలో ఇంట్వల్, క్లైమాక్స్‌ల ముందు వచ్చే 10 నిమిషాల ఎపిసోడ్స్ హృదయానికి హత్తుకునేలా వుంటాయి. ఈ చిత్రంలో కథానాయికగా కోమల్‌ఝా నర్తకిగా కనిపిస్తుంది. 50ఏళ్లనాటి ఫ్లాష్‌బ్యాక్‌లో ఆమె కనిపిస్తుంది. సినిమాలో వచ్చే రెండు ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ ఆసక్తికరంగా వుంటాయి. కథలో కీలక మలుపులు అవే. టైటిల్‌కు తగినట్లుగానే జీవితంలోని చిన్న చిన్న ఆనందాలు..చిన్న గొడవలు...సున్నితమైన భావోద్వాల మేళవించిన చిత్రమే 'చిన్న సినిమా'.

    సంస్థ: జెర్సీ ప్లాట్స్‌
    నటీనటులు: అర్జున్‌ కల్యాణ్‌, సుమోన చందా, వెన్నెల కిషోర్‌, రమేష్‌, ఎమ్‌.బాలయ్య, ఎల్‌.బి.శ్రీరామ్‌, సూర్య, కోమల్‌, సిద్ధార్థ్‌, కేథరిన్‌, మహేష్‌ శ్రీరాముల, కార్తీక్‌ శ్రీనివాస్‌ తదితరులు
    కెమెరా: హైదర్‌ బిల్‌గ్రామి, పి.జి.విందా,
    సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు,
    కథ-మాటలు: శేఖర్‌,
    పాటలు: చక్రవర్తుల, శ్రీనివాసమౌళి, శ్రీజో, కె.ఎస్‌.ఎమ్‌.ఫణీంద్ర.
    నిర్మాతలు: శేఖర్‌-జ్యోతి
    దర్శకత్వం: ఎ.కె.కంభంపాటి
    విడుదల: శుక్రవారం.

    English summary
    Budding actor Karthik Srinivas is playing a key role in the today's release ‘Chinna Cinema’. After pursuing Masters in EE from California, he was determined to follow his dream of becoming an actor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X