»   » గాయాలు తగ్గి షూటింగ్ కు వస్తోంది

గాయాలు తగ్గి షూటింగ్ కు వస్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిన్న చిత్రాల్లో మంచి విజయం సాధించిన చిత్రం 'ఉయ్యాలా జంపాలా' హీరోయిన్ అవికా గోర్. ఈ చిత్రం హిట్ ఈమెకు బాగానే కలిసి వచ్చింది. ఆమెకు వరస ఆఫర్స్ వచ్చినా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికీ హిందీ సీరియల్స్ చేస్తూనే ఉంది. ముంబైలో హిందీ సీరియల్ షూటింగ్ లో ఉండగా...చిన్న ప్రమాదం జరిగి కాలుకి దెబ్బ తగిలింది. దాంతో ఆమె కొన్ని వారాలపాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కోలుకుని మళ్లీ షూటింగ్ లుకు హాజరవుతోంది. ఈ విషయాన్ని ఆమెతో చిత్రం చేస్తున్న నిర్మాతలు సైతం మీడియా ముఖంగా తెలియచేసారు.

ఇటీవల ముంబాయిలో జరిగిన ఓ చిన్న ప్రమాదంలో హీరోయిన్ అవికాగోర్‌కు చిన్న గాయం అయినందువల్ల షూటింగ్‌కు అంతరాయం కలిగిందని, ఇప్పుడామె కోలుకోవడంతో హైదరాబాద్ సారధి స్టూడియోలో కొన్ని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని నిర్మాత గిరిధర్ తెలిపారు. చిన్నారి పెళ్లికూతురుకి బుల్లితెరపై అదరకొట్టిన ఆమె ఉయ్యాల జంపాలతో పెద్ద తెరపై సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయ్యింది. అంతేకాక వరస ఆఫర్స్ అందిపుచ్చుకుంటోంది.

Chinnari Pellikooturu Avika Gor Injured

గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై నాగశౌర్య, అవికాగోర్ జంటగా నంద్యాల రవి దర్శకత్వంలో మామిడిపల్లి గిరిధర్ రూపొందిస్తున్న చిత్రం 'లక్ష్మీ రావే మా ఇంటికి'. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవల బెంగుళూరులో చేశారు. ప్రస్తుతం మూడో షెడ్యూల్ హైదరాబాద్‌లో సాగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మామిడిపల్లి గిరిధర్ మాట్లాడుతూ- జూలై 15 వరకు కొనసాగే మూడో షెడ్యూల్‌తో టాకీ పూర్తవుతుందని తెలిపారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని దర్శకుడు నంద్యాల రవి అన్నారు.

షాయాజీ షిండీ, అలీ, ప్రగతి, సత్యం రాజేష్, రావూ రమేష్, అనితాచౌదరి, భగవాన్, శశి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:బాలరెడ్డి, సంగీతం:ఎ.కె.రాధాకృష్ణన్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:నంద్యాల రవి, నిర్మాత:గిరిధర్

తను డిమాండ్ చేసిన రెమ్యునేషన్ ఇచ్చేవాళ్లు,బ్యానర్ వంటి అంశాలు పరిగణలోకి తీసుకుని ఓకే చేస్తోంది. తాజాగా ఆమె మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెక్కం వేణు గోపాల్ నిర్మిచే చిత్రం ఆమె సైన్ చేసిందని సమాచారం. ఈ చిత్రం ద్వారా మురళీధర్ అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు.

అలాగే రచయిత నంధ్యాల రవి దర్శకత్వంలో రూపొందే లక్ష్మీ రావే మా ఇంటికి...చిత్రం ఆమె చేస్తోంది. జర్నలిస్ట్ అయిన గిరిధర్ నిర్మిస్తున్న ఈ సినిమా లాంచ్ అయ్యి షూటింగ్ జరుగుతోంది. మీడియం బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం. ఇలా ఈ రెండు చిత్రాలు కొత్త దర్శకులతోనే కావటం విశేషం.

'ఉయ్యాలా జంపాలా'కు ముందే అవికాగోర్ తెలుగువారికి పరిచయం. 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ తో ఆంధ్రప్రదేశ్ లో మంచి గుర్తింపు వచ్చింది. దాంతో ఆమె ఫ్యాన్స్ తో ఈ చిత్రానికి ఓపినింగ్స్ సైతం రాబట్టుకుంది. నాగార్జున, హిట్‌ చిత్రాల నిర్మాత రామ్మోహన్‌ పి. నిర్మించిన ఈ విభిన్న కథా చిత్రం బావా మరదళ్ల ప్రేమ కథగా రూపొంది విడుదలైంది.

ఈ చిత్రం రిలీజైన రోజు నుంచి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. పబ్లిసిటీ తో కలిపి రెండున్నర కోట్లు బడ్జెట్ అయిన ఈ చిత్రం 17 కోట్లు(గ్రాస్)కలెక్టు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. చిన్న సినిమాగా రిలీజైన ఈ చిత్రం కలెక్షన్స్ లో పెద్ద సినిమాతో పోటీ పడటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

English summary
Avika Gor is still continuing her roles in Hindi serials and she was injured in Mumbai during the shoot of a popular Hindi serial. Avika fractured her leg and she was advised to take some rest for a couple of weeks.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu