For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎవరెస్ట్‌ నేపథ్యంగా స్టార్ హీరోకు కథ: చిన్ని కృష్ణ

  By Srikanya
  |

  ఎవరెస్ట్ శిఖరం నేపథ్యంలో ఓ కథ తయారు చేయనున్నానని, ఓ పెద్ద హీరో కోసం చేస్తున్న కథ అది అని ప్రముఖ రచయిత చిన్నికృష్ణ తెలిపారు. తాజాగా ఆయన నేపాల్‌లో ఆ దేశ అధ్యక్షుడు రామ్‌భరణ్‌ యాదవ్‌ చేతుల మీదుగా ఇండో నేపాల్‌ యూనిటీ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిన్నికృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. అలాగే ..పవిత్రమైన గంగ, హిమాలయాల నేపథ్యంతో కథలు రాయడం, ఆ ఆలోచనలు రావడం నా అదృష్టం. ఇప్పటి వరకూ నా కథల్లో వాటి గురించి చెప్పింది ఒక్క శాతమే. రాయాల్సింది చాలా ఉంది అన్నారు.

  ఇంద్ర, గంగోత్రి, బద్రీనాథ్ చిత్రాల కథలతో హిమాలయాల గొప్పతనాన్ని, గంగానది విశిష్టతను తెలియజేసిన కథారచయిత ఆకుల చిన్నికృష్ణకు 'ఇండో నేపాల్ యూనిటీ' అవార్డు వరించింది. దేశంలోని వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ఎకనామిక్ గ్రోత్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఈజీఎస్‌ఐ) వారు ప్రతి ఏడాదీ ఈ అవార్డును అందజేస్తారు. గత నెల ఏప్రిల్ 28న నేపాల్ అధ్యక్షుడు రామ్‌బరన్ యాదవ్ చేతుల మీదుగా చిన్నికృష్ణ ఈ అవార్డును అందుకున్నారు.

  చిన్నికృష్ణ మాట్లాడుతూ- ''గతంలో వివిధ రంగాల వారు ఈ అవార్డును అందుకున్నారు. అయితే... సినిమా రచయితలు అందుకోవడం మాత్రం నాతోనే ప్రథమం. ఈ గౌరవాన్ని నాకు అందించింది సినిమా తల్లి. అందుకే తెలుగు సినీరంగానికి సర్వదా రుణపడి ఉంటాను. మన దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ గంగ, హిమాలయాల నేపథ్యంలో కథలు రాయడం మూలంగానే నాకీ పురస్కారం దక్కింది'గంగోత్రి' కథ రాయడానికి పదిహేను లక్షలు ఖర్చయింది. ఆరు నెలలు టైమ్ పట్టింది. మంచి కథ కోసం రాజీ అనే పదానికి తావివ్వకుండా నన్ను ముందుకు నడిపించిన కె.రాఘవేంద్రావు, అల్లు అరవింద్, అశ్వనీదత్‌గార్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.


  అలాగే...'బద్రీనాథ్' సినిమా విషయంలో పూర్తి క్రెడిట్ అల్లు అరవింద్ గారికే దక్కుతుంది. భార్య చనిపోయిన బాధలో ఉన్న నన్ను ఊరడించి, 25 లక్షలు ఖర్చుపెట్టి బద్రీనాథ్ పంపించి ఈ కథ రాయించారు. ఈ రోజు నేను అందుకున్న ఈ అవార్డులో సింహభాగం షేర్ వారికే దక్కుతుంది'' అని తెలిపారు. తను ప్రస్తుతం కథ అందించిన 'జీనియస్' సినిమా గురించి ఆయన మాట్లాడుతూ- ''70 శాతం చిత్రీకరణ పూర్తయింది. శరత్‌కుమార్ ఇందులో ఓ పవర్‌ఫుల్‌పాత్ర చేస్తున్నారు. రేపటి నుంచే ఆయన పాత్ర చిత్రీకరణ మొదలుకానుంది. చదువు, యువతరం నేపథ్యంతో 'జీనియస్‌' అనే చిత్రానికి కథను అందించాను. సింహభాగం చిత్రీకరణ పూర్తయింది.'' అని తెలిపారు.

  ''''న్నారు కథా రచయిత చిన్నికృష్ణ. ఆయన ఇటీవల ''. 'గంగోత్రి', 'బద్రినాథ్‌' చిత్రాల కోసం ఎంతో కష్టపడ్డాను. ఆ ప్రాంతాలకు వెళ్లి నెలల తరబడి కూర్చొని కథలు రాసుకొన్నాను. అందుకు ప్రతిఫలంగా ఈ పురస్కారం దక్కడం ఆనందంగా ఉంది. ఇదంతా తెలుగు చిత్ర పరిశ్రమ గొప్పదనంగానే భావిస్తాన''న్నారు. ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ '' అలాగే ఎవరెస్ట్‌ నేపథ్యంగా ఓ కథను సిద్ధం చేస్తున్నాను'' అన్నారు.

  English summary
  
 Chinni Krishna, the script-writer who shot to fame with ‘Indra’, has been recognized with an Indo-Nepal unity award for penning films set in the backdrop of the Himalayas, the majestic mountain ranges that occupy a significant place in the Indian culture. The award was conferred by the President of Nepal on the recommendation of two eminent people (names not revealed by Chinni Krishna), who like his movies.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X