అన్నాహజారే గ్రామంలో రైటర్ చిన్నికృష్ణ
తన గత చిత్రాల్లాగే సంచలన విజయం సాధించేలా 'జీనియస్" కథను రూపొందించడం జరిగిందని, ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేని అన్నాహజారే సొంతవూరు 'రాలేగావ్ సిపీ"లో కూర్చొని రాయడం జరిగిందని ప్రముఖ రచయిత చిన్నికృష్ణ చెప్పారు. నరసింహనాయుడు, ఇంద్ర, గంగోత్రి, బద్రినాథ్ వంటి సంచలన హిట్ చిత్రాలకు కథను అందించిన ప్రముఖ రచయిత చిన్నికృష్ణ తాజాగా కథ సమకూర్చిన చిత్రం -'జీనియస్". ఈ చిత్రం ద్వారా ఓంకార్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త దాసరి కిరణ్‌కుమార్ తొలిసారి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 7న షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఇలా స్పందించారు.
అలాగే సామాజిక సమస్యకు కథలో ఎంతో ప్రాథాన్యం ఉన్నందున ఆ గ్రామం వెళ్లి స్క్రీన్‌ప్లే రాయవలసి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 12 నెలల కృషి అనంతరం తమ కథకు తగిన హీరో ఈ చిత్రానికి దొరికారని చిన్నికృష్ణ పేర్కొన్నారు. కథలోని గొప్పతనం, ఓంకార్‌లోని ప్రతిభ చూసి ఈ చిత్రాన్ని భారీ ఖర్చుతో నిర్మించదలిచినట్లు కిరణ్‌కుమార్ తెలిపారు. తొలి సినిమాతోనే తాను సంచలన విజయం సాధించేలా యూనిట్ సభ్యులంతా ఈ చిత్రానికి కుదిరారని ఓంకార్ చెప్పారు. ఇక చిన్ని కృష్ణ రీసెంట్ గా వినాయిక్ దర్శకత్వం వహించిన బద్రీనాధ్ కి కథ అందించారు. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద పెయిల్యూర్ అయ్యింది.


Click it and Unblock the Notifications











