»   » బాలయ్య బాబుకి దశాబ్దంలో నిలిచిపోయే చిత్రం ఇస్తా

బాలయ్య బాబుకి దశాబ్దంలో నిలిచిపోయే చిత్రం ఇస్తా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ నూతన దశాబ్దంలో బాలయ్యబాబు కెరీర్ ‌లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి నందీశ్వరుడు చిత్రం స్క్రిప్టును రెడీ చేసాను..బాలయ్య బాబుకి ఎన్నో రెట్లు విలువైన సినిమాని చేయాలనుకుంటున్నాను. అదే 'నందీశ్వరుడు'. చాలా పవర్‌ఫుల్ సబ్జెక్ట్ అది. 'నరసింహనాయుడు' కంటే వందరెట్లు అధికంగా ఉండే కథ అది అన్నారు రచయిత చిన్ని కృష్ణ. గతంలో ఆయన ఘన విజయాలు సాధించిన బాలకృష్ణ నరసింహనాయుడు, చిరంజీవితో ఇంద్ర చిత్రాలకి ఆయన కథ అందించారు. ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్, వివి వినాయిక్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న బద్రీనాధ్ చిత్రానికి కథ అందించారు. అలాగే ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న జీనియస్ చిత్రానికి కూడా కథ ఇచ్చారు.

ఇక ఆయన తన ఆశయాలు గురించి చెబుతూ..నాకు డబ్బు గురించి ఆలోచనే లేదు. అందుకే ఈ పదేళ్ల కాలంలో అయిదారు సినిమాలే చేశాను. అపజయం ఎరుగని జేమ్స్ కామరిన్, రాజ్‌క పూర్, భాగ్యరాజా..లను ఆదర్శంగా తీసుకుని హైక్వాలిటీ కలిగిన విభిన్న చిత్రాలు చేయాలని ఉంది. నాకో కోరిక ఉంది. అమీర్‌ ఖాన్ ‌తో అతని లైఫ్ టైమ్ యాంబిషన్ అయిన ఆస్కార్ అవార్ట్‌ ని, 375 కోట్లు వసూలు చేసిన 'త్రీ ఇడియట్స్' చిత్రాన్ని క్రాస్ చేసే సినిమా చేయాలని ఉంది. మూడేళ్లు వర్క్ చేసి ఓ అద్భుతమైన కథను తయారు చేశాను. అది అమీర్ ‌ఖాన్ ‌కు వినిపించబోతున్నాను అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu