twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను, నా భార్య సురేఖ ప్రతీరోజు కొట్టుకొంట్టాం.. గొడవలు పెట్టుకొంటాం.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్

    |

    Recommended Video

    MAA Controversy : Chiranjeevi and Rajashekar spar at MAA Dairy 2020 Launch

    మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) సభ్యులంతా ఐక్యమత్యంగా ఉండాలని, అప్పుడే ప్రభుత్వాలతో సహాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మా డైరీ ఆవిష్కరణ 2020 కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు, నటుడు, నిర్మాత మురళీ మోహన్, రచయిత గోపాలకృష్ణ, వీకే నరేష్, జీవితా రాజశేఖర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ..

    టాలీవుడ్‌కి సిల్వర్ జూబ్లీ ఇయర్

    టాలీవుడ్‌కి సిల్వర్ జూబ్లీ ఇయర్

    తెలుగు సినీ పరిశ్రమకు ఇది సిల్వర్ జూబ్లీ. అందుకే మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ కోసం నిధులను భారీగా సేకరించాలి. అందుకోసం రెండు, మూడు కార్యక్రమాలను నిర్వహించడానికి నేను ముందుంటాను. నాగార్జున, మహేష్‌బాబు, ప్రభాస్‌ను రావాలని ఆహ్వానిస్తాను. అవసరమైతే పవన్ కల్యాణ్‌ను కూడా రమ్మని కోరుతాను. యువ హీరోల్లో రాంచరణ్, అర్జున్, ఇతర హీరోలను కూడా ఇందులో భాగం చేసేలా ప్రయత్నిస్తాను. నా మీద గౌరవంతో ఎవరూ కాదనరనే అభిప్రాయం ఉంది అని చిరంజీవి అన్నారు.

    ప్రజలను భాగస్వామ్యం చేయడమే

    ప్రజలను భాగస్వామ్యం చేయడమే

    సినిమా హీరోలు కోట్లు సంపాదిస్తున్నారు. మీరు తలో కోటి రూపాయలు ఇవ్వవచ్చు కదా అంటే.. ‘మా'బలోపేతానికి సినిమా పరిశ్రమనే కాకుండా ప్రజలను కూడా ఇందులో భాగస్వామ్యయ్యేలా చేయడమే మా ప్రయత్నం. సినీ కళాకారులను ఆదుకోవడానికి, మా అసోసియేషన్‌ను ఆర్థికంగా బలమైన సంస్థగా మార్చేందుకు నన్ను ఏం చేయమన్నా చేస్తాను అని చిరంజీవి అన్నారు.

    మంత్రి కేటీఆర్‌తో చర్చించా

    మంత్రి కేటీఆర్‌తో చర్చించా

    మా అసోసియేషన్ కోసం మంత్రి కేటీఆర్‌తో కూడా మాట్లాడాను. మంచి భవనానికి భూమి కేటాయించాలని అడిగాను. అందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. అదే సమయంలో మాలో కొంత మేరకు విభేదాలు ఏర్పడ్డాయి. అంతలోనే ఎలక్షన్లు వచ్చాయి. దాంతో ఆ విషయంపై మళ్లీ ముందుకు వెళ్లలేకపోయాం. అయినా అదే ప్రభుత్వం ఉంది. మాట ఇచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు.

    కేసీఆర్ ప్రభుత్వం రెడీగా ఉంది

    కేసీఆర్ ప్రభుత్వం రెడీగా ఉంది

    ఇటీవల కేసీఆర్‌ను కూడా కలిశాను. ఆయన కూడా స్వయంగా సహకారం అందిస్తాను చెప్పారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం రెడీగా ఉంది. అందుకోసం మనమంతా ఏకాభిప్రాయం ఉండాలి. అటు ఏపీలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంగా సినీ పరిశ్రమ అభివృద్ధికి సానుకూలంగా ఉంది అని చిరంజీవి చెప్పారు.

    నాతో సురేఖ ప్రతీ రోజు

    నాతో సురేఖ ప్రతీ రోజు

    ప్రభుత్వాలు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మనమంతా ఐక్యమత్యంతో ఉండాలి. ప్రతీ ఇంటిలో గొడవలు ఉంటాయి. నేను, నా భార్య సురేఖ ప్రతీ రోజు కొట్టుకొంటాం. తిట్టుకొంటాం. బయటకు వెళ్తే చేతిలో చేయి వేసుకొని ముచ్చటగా కనిపిస్తాం. మమల్ని చూస్తే ఆదర్శ దంపతులు అనుకొంటారు. ఇంట్లోకి వెళ్తే చేయి విదిలేసుకొంటాం. కానీ బయటి ప్రపంచానికి ఎవరికీ తెలియవు. ఒక కుటుంబం అంటే చిలిపి సంఘటనలు ఉంటాయి. కాబట్టి సర్దుకుపోవాలని నేను కోరుకొంటున్నాను అని చిరంజీవి అన్నారు.

    English summary
    Movie Artists Association Dairy Inauguration 2020 held at Park Hayat of Hyderabad. Chiranjeevi, Mohan Babu, Krishnam Raju attended the function.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X