»   » చిరంజీవి యాక్షన్‌కు ‘రాధిక’ రియాక్షన్‌ అదుర్స్‌...

చిరంజీవి యాక్షన్‌కు ‘రాధిక’ రియాక్షన్‌ అదుర్స్‌...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం 'ప్రజాచైతన్య" యాత్రలో బిజీగా వున్నప్రజారాజ్యం అధ్యక్షుడు మెగాస్టార్‌ చిరంజీవి ఇటీవల ఓ ఇంటర్వ్యూ తనకు జోడీగా నటించిన హీరోయిన్స్‌ గురించి వివరిస్తూ...'సినిమాలో నా సరసన నటించిన హీరోయిన్స్‌లో ప్రత్యేకంగా ఎవరితోనూ గుర్తించుకొనేంత పరిచయాలు లేవు. కానీ...రాధిక విషయంలో మాత్రం నటనా పరంగా తనతో చేసిన సన్నివేశాల్లో ఎంతో ఉత్సాహంగా నా యాక్షన్‌ కు తన రియాక్షన్‌ ఎంతో అద్భుతంగా ఉండేది.

అలాగే డ్యాన్స్‌ విషయంలో కూడా రాధ నాకు పోటాపోటీగా చేసేది. నేను 'పద్మభూషణ్‌' అవార్డు తీసుకొనేటప్పుడు నా తొలి చిత్రం వాసు దర్శకత్వంలో రూపొందిన చిత్రం'పునాది రాళ్ళు" హీరోయిన్‌ 'రేష్మి రాయ్‌' తో పాటు నాతో నటించిన హీరోయిన్లు అందరూ స్టేజిపై నాపై చూపించిన ప్రేమాభిమానాలు...అందరం కలిసిన ఆ మధుర క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేను అని అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu