రాజశేఖర్ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరింజీవి!??

ఇప్పటికే తను సినిమాల్లో నటిస్తున్నాడంటూ..రెండు చిత్రాల పేర్లు వినిపించగా వాటన్నింటిని కాదని ఇప్పుడు కొత్త విషయం ఒకటి వెలుగులోనికి వస్తుంది..ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్ దర్శకత్వలో చిరంజీవి తన 150వ చిత్రాన్ని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం.
సమైక్యాంధ్ర, తెలంగాణ సెగల మధ్య తను సినిమా చేసినా చాలా ఇబ్బందులు తలెత్తుతాయని భావించి ఇంతకాలం సినిమా అంటే వెనక్కి వెళ్లిన 'చిరు" త్వరలో చిత్రం చేయనున్నాడని 99 శాతం తెలుస్తుంది. మరి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి", 'చంద్రముఖి2" లో లేనిది అమ్మ రాజశేఖర్ వినిపించిన కథలో ఉన్నది ఏమిటో తెలియదు కానీ ఆయన చెప్పిన కథ చిరుకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని సమాచారం. అంత సంతోషాన్ని ఇచ్చిన కథను తను నటించి తన అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తాడో లేక దీన్ని కూడా అటకెక్కిస్తాడో అనేది ఇంకా తెలియాల్సి వుంది. అన్ని విషయాలు త్వరలోనే తెలుస్తాయని అప్పటివరకు వేచి చూడాల్సిందేనని సమాచారం.


Click it and Unblock the Notifications











