Don't Miss!
- News
దేశంలో తెలంగాణ 3వ స్థానం: వైద్యారోగ్య మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న హరీశ్ రావు
- Sports
మహిళా క్రికెట్లో సంచలనం.. ప్రపంచకప్ గెలిచిన భారత్
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
HBDSaiDharamTej: రెండు పండుగలు అంటూ పవన్ ట్వీట్.. తేజ్ వల్ల దసరా స్పెషల్ అయిందంటూ చిరు పోస్ట్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. తన స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తోన్న సమయంలో అతడు అదుపు తప్పి కింద పడిపోయాడు. దీంతో శరీరంపై కొన్ని ప్రాంతాల్లో గాయలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మాదాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు. దాదాపు నెల రోజులుగా అదే ఆస్పత్రిలో చికిత్సను తీసుకున్న అతడు తాజాగా డిశ్చార్జ్ అయ్యాడు. దీనికితోడు ఈరోజు సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు. వీటిని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు సెలెబ్రిటీలు ట్వీట్లు చేశారు. ఆ సంగతులు మీకోసం!

అలా పడిపోయిన తేజ్... సర్జరీ చేసి
సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి తన స్పోర్ట్స్ బైక్‌పై స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ గచ్చిబౌలీ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఐకియా దాటిన వెంటనే అతడు బైక్ నుంచి కిందపడిపోయారు. ఆ షాక్‌లో అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్‌కు పలు చోట్ల గాయాలయ్యాయి. అలాగే కాలర్ బోన్ కూడా విరిగడంతో సర్జరీ చేశారు.
జబర్ధస్త్ సెట్లో బాలకృష్ణకు రోజా ఫోన్: ఊహించని మాటలతో షాకిచ్చిన నటసింహం.. సంచలనంగా ఆడియో క్లిప్

నెల రోజుల తర్వాత సాయి డిశ్చార్జ్
రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత చాలా రోజుల పాటు సాయి ధరమ్ తేజ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు కనిపించింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల తర్వాత అతడు పూర్తిగా కోలుకున్నాడు. అయినప్పటికీ ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఇలా దాదాపు నెల రోజుల తర్వాత నేడు అంటే శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవడంతో పాటు క్షేమంగా ఇంటికి చేరాడు.

సాయి తేజ్ పుట్టినరోజు.. ట్వీట్ల వర్షం
అక్టోబర్ 15 సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని సినీ రంగానికి చెందిన చాలా మంది సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే సమయంలో అతడు ఇదే రోజున ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవడంపైనా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక, తేజ్ రాకతో మెగా ఫ్యామిలీలో దసరా పండుగ సంబరం రెట్టింపు అయిందనే చెప్పాలి.
Most Eligible Bachelor Twitter Review: మూవీకి ఊహించని టాక్.. ప్లస్ మైనస్ ఇవే.. ఆ పొరపాటు లేకుంటే!
|
దసరా మరింత స్పెషల్ అన్న చిరు
పుట్టినరోజుతో పాటు దసరా పండుగ నాడు సాయి ధరమ్ తేజ్ క్షేమంగా ఇంటికి చేరడంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. 'పెద్ద యాక్సిడెంట్ నుంచి కోలుకుని సాయి తేజ్ క్షేమంగా ఇంటికి చేరడంతో ఈ దసరా మాకు మరింత స్పెషల్ అయింది. ఇది అతడికి పునర్జన్మ లాంటిది. మీ అత్త పెద్దమామ నుంచి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తేజ్' అంటూ అందులో పేర్కొన్నారు.

రెండు పండుగలంటూ పవన్ ట్వీట్
సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్ అవడంపై పవన్ కల్యాణ్ స్పెషల్‌గా ఓ లేఖను వదిలాడు. 'అనుకోని రీతిలో ప్రమాదం బారిన పడి నెలరోజులుగా చికిత్స పొందిన సాయి తేజ్ క్షేమంగా ఇంటికి చేరాడు. దసరా రోజు ఇంటికి రావడం మాకు మరింత ఆనందాన్ని కలిగించింది. ఈరోజే తేజ్ పుట్టినరోజు. నీకు మరిన్ని విజయాలు రావాలని కోరుకుంటున్నా' అని అందులో పేర్కొన్నాడు.
హాట్ డ్రెస్‌లో మంచు లక్ష్మీ అందాల ఆరబోత: ఎద భాగం మొత్తం కనిపించేలా.. మరీ ఇంత దారుణమా!

వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్పిన పవన్
ఇదే లేఖలో 'తేజ్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అభిమానులు ఎంతో బాధ పడి.. అతడు క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. ఆలయాల్లో, ప్రార్ధనా మందిరాల్లో పూజలు చేశారు. వాళ్ల ప్రార్ధనలు ఫలించాయి. ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు పవన్. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అయిపోతోంది.
Recommended Video

అందులో మాత్రం ఫ్యాన్స్‌కు నిరాశే
సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'రిపబ్లిక్'. దేవ కట్టా తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం అంతగా రాలేదు. దీంతో నిర్మాతలకు పెట్టుబడి కూడా దక్కలేదు. ఈ ఒక్క విషయంలో మాత్రం మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారనే చెప్పాలి.