»   » సంపూ... చించేసాడు అంటూ చిరంజీవి అభినందన!

సంపూ... చించేసాడు అంటూ చిరంజీవి అభినందన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హృదయ కాలేయం' సినిమాతో టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుని వరుస అవకాశాలతో తూసుకెలుతున్న సంపూర్ణేష్ బాబు బాబు త్వరలో 'కొబ్బరి మట్ట'తో ప్రేక్షకులపై దాడి చేయబోతున్నాడు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయం చేస్తుండటం గమనార్హం.

Chiranjeevi Appreciates Sampoo's Pedarayudu Dialogue

ఈచిత్రానికి సంబందించిన టీజర్ ఇటీవల విడుదలైంది. ఇందులో సంపూ చెప్పిన భారీ డైలాగ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. పెదరాయుడి పాత్రలో గుక్కతిప్పుకోకుండా డైలాగ్ చెప్పి సంపూర్ణేష్ బాబు అదరగొట్టారని అంటున్నారంతా.

ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి నుండి కూడా సంపూకు ప్రశంసలు అందాయి. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయిూస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి చిరంజీవి హాజరు కాగా... అక్కడ చిరంజీవిని కలిసే అవకాశం దక్కించుకున్నాడు సంపూ. ఈ సందర్భంగా తన కొబ్బరి మట్ట టీజర్ చూపించాడు. అది చూసిన తర్వాత చిరంజీవి... సంపూను డైలాగ్ బాగా చెప్పావ్ అంటూ ప్రశంసించారట.

ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయం చేస్తుండటం గమనార్హం. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడు అనే మూడు డిఫరెంట్ పాత్రల్లో సంపూర్ణేష్ బాబు కనిపించబోతున్నారు. ఇప్పటికే పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడు పాత్రకు సంబంధించిన లుక్ రిలీజ్ చేసారు. రూపక్ రొనాల్డ్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్‌, గుడ్‌ సినిమా గ్రూప్‌, సంజన మూవీస్‌ పతాకంపై ఆది కుంభగిరి, సాయి రాజేష్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary
Chiru attended the felicitation ceremony of film industry workers by the All India Film Employee's Confederation. Sampoo was also present at the event as one of the guests and he managed to spend some time with Chiru and that was when he took out his smartphone and showed Chiru the teaser of Kobbari Matta.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu