»   » రామ్ చరణ్ కూడా అడిగాడనే...చిరంజీవి

రామ్ చరణ్ కూడా అడిగాడనే...చిరంజీవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

"ఎక్కడకు వెళ్లినా..మళ్లీ ఎప్పుడు నటిస్తారూ..? అని అందరూ అడుగుతున్నారు..అందుకే మళ్లీ నటించడానికి అంగీకరించా.చరణ్ కూడా మీలో ఒక్కడై..మీరు ఒక సినిమాలో నటిస్తే చూడాలని ఉంది అని అడిగాడు. దాంతో కాదనలేకపోయాను. మళ్లీ సినిమా అంటూ చేస్తే..అది అభిమానులను పూర్తిస్థాయిలో ఇంప్రస్ చేసే విధంగా ఉండాలి. అలాంటి కథ కోసం ఎదురుచూస్తున్నా. త్వరలో ఓ మంచి పాత్రతో మీ ముందుకు వస్తా" అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన షాపింగ్ మాల్ (తమి ళంలో అంగాడితెరు) చిత్రం ఆడియో ఆవిష్కరణ మంగళవారం నగరంలోని శిల్పకళా వేదికలో హాజరై ఇలా మాట్లాడారు. సంతోషం పత్రికాధినేత సురేష్ కొండేటి మహేష్, అంజలి జంటగా నటించిన ఆడియో సీడీని చిరంజీవి ఆవిష్కరించి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ డి.రామానాయుడుకి అందించారు. కార్యక్రమంలో శ్రీహరి, కోడి రామకృష్ణ,బ్రహ్మానందం, యువ హీరో నిఖిల్, ఎం.ఎల్.కుమార్చౌదరి, అంబికాకృష్ణ, చిత్ర దర్శకుడు వసంతబాలన్, శశాంక్ వెన్నలకంటి పాల్గొన్నారు. ఇక షాపింగ్ మాల్ లో మహేష్‌, అంజలి జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంథోని, జి.వి. ప్రకాష్‌కుమార్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, సహ నిర్మాత: ఊటుకూరి నాగార్జున్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సత్య శ్రీనివాస్‌ బలువు, నిర్మాత: సురేష్‌ కొండేటి, దర్శకత్వం: జి. వసంతబాలన్‌.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu