»   » 'బ్రూస్‌లీ' అఫీషియల్ న్యూస్ : చిరు కనపడేది ఎన్ని నిమిషాలంటే...

'బ్రూస్‌లీ' అఫీషియల్ న్యూస్ : చిరు కనపడేది ఎన్ని నిమిషాలంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లు జంటగా నటిస్తున్న 'బ్రూస్‌లీ' చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ చిత్రంలో ఆయన కేవలం 3 నిమిషాల యాక్షన్‌ సీక్వెన్స్‌లో కనిపించనున్నారట. ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వారు తమ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.

Here's an sneak peak insider update for all you #Megafans - #Megastar' Chiranjeevi garu's cameo in #BruceLeeTheFighter will be a 3 minute action sequence!!


Posted by DVV Entertainments on28 September 2015

అలాగే చిరంజీవి దాదాపు ఎనిమిది సంవత్సరాల విరామం తరువాత తమ ప్రాజెక్టులో పనిచేయడంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.


#WelcomeBackMegastar! Honored to have Megastar Chiranjeevi garu as part of our project. We are short of words to express...


Posted by DVV Entertainments on27 September 2015

శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డి.వి.వి దానయ్య నిర్మాత. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. 'బ్రూస్‌లీ' గీతాలను అక్టోబర్‌ 2న విడుదల చేయనున్నారు.


చిరు ఎంట్రీపై రామ్ చరణ్ మాట్లాడుతూ...


''డాడీ ఈ చిత్రంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన్ని సెట్లో చూస్తుంటే కొత్త ఉత్సాహం వస్తోంది. ఆయన తదుపరి చిత్రానికి ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఓ టీజర్‌ లాంటిది మాత్రమే'' అంటూ రామ్‌చరణ్‌ స్పందించారు.


chiru

రామ్ చరణ్, చిరంజీవి లపై కొన్ని కీలకమైన సన్నివేశాలను మూడు రోజుల పాటు తీస్తారు. చిరంజీవి చాలా రోజుల తర్వాత ముఖానికి మేకప్ వేసుకోవటంతో అభిమానులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవి ఈ చిత్రంలో చేయబోయే సీన్స్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయిటకు వచ్చింది.


charan

లారెన్స్ స్టైల్ సినిమాలో చేసినట్లుగానే చిరంజీవి ఈ సినిమాలో రామ్ చరణ్ ని క్లైమాక్స్ ముందు ఓ కష్టం నుంచి బయిటపడేస్తారు. రకుల్ ప్రీతి ని విలన్స్ నుంచి కాపాడటానికి చిరంజీవి హెల్ప్ చేస్తారు. రామ్ చరణ్ వంటి హీరోకి హెల్ప్ చేయగలవారు ఎవరా అని ఆలోచించి చిరంజీవి అయితేనే బెస్ట్ అని ఒప్పించినట్లు సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి తన నిజ జీవితలో లాగానే మెగాస్టార్ చిరంజీవి గా సినిమా హీరోగా కనిపిస్తారు. అయితే ఇదంతా నిజమా కాదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ దాకా ఆగాల్సిందే.వచ్చే నెల 2న పాటల్ని, 16న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలోని ఓ పాట కోసం ఏకంగా రూ.1.7 కోట్లు ఖర్చు చేశారట. ఈ పాటే కాదు, సినిమా మొత్తం గ్రాండ్‌గా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.

English summary
Here's an sneak peak insider update for all you ‪#‎Megafans‬ - ‪#‎Megastar‬' Chiranjeevi garu's cameo in ‪#‎BruceLeeTheFighter‬ will be a 3 minute action sequence!!
Please Wait while comments are loading...