twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీలుకాకుంటే రామ్‌చరణ్‌తోనైనా చేస్తాను

    By Srikanya
    |

    డిల్లీ : '''అభిలాష' సినిమాను ఇదే యూనిట్‌తో తీయాలని నిన్నే గొల్లపూడి మారుతీరావు నాకు సూచించారు. నాక్కూడా చేయాలని ఉంది. ఒకవేళ వీలుకాకుంటే రామ్‌చరణ్‌తోనైనా చేస్తాను'' అని నిర్మాత కె.ఎస్ రామారావు తెలిపారు. యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా తెరకెక్కి మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఆణిముత్యంగా నిలిచిపోయిన చిత్రం 'అభిలాష'. ఈ నెల 11తో 'అభిలాష' సినిమా 30 సంవత్సరాల్ని పూర్తిచేసుకుంది.

    ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.ఎస్.రామారావు, దర్శకుడు కోదండరామిరెడ్డి, రచయిత యండమూరి వీరేంధ్రనాథ్ మంగళవారం ఢిల్లీలో కేంద్ర పర్యాటకశాఖా మంత్రి చిరంజీవిని కలిసి అభినందించారు. వారి సమక్షంలో చిరంజీవి కేక్ కట్ చేసి సినిమా నిర్మాణ విషయాల్ని మననం చేసుకున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 'అభిలాష' చిత్రం సరికొత్త ట్రెండ్‌ను సృష్టించిందని, అందులో తను పోషించిన 'చిరంజీవి' పాత్ర చిరస్మరణీయమైనదని చిరంజీవి పేర్కొన్నారు.

    ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ''అభిలాష నా సినీ జీవితానికి ఎంతో దోహదకారిగా నిలిచింది. ఆ కథ మీద ఆసక్తితో కేఎస్‌రామారావు క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పేరిట అప్పటికప్పుడు సంస్థను ఏర్పాటు చేసి నిర్మాతగా వచ్చారు. ఈ సినిమా 30 ఏళ్లు అయినట్లు నాకు అనిపించడంలేదు. 'అభిలాష' చిత్రం నా సినీరంగ కెరీర్ తొలినాళ్లలో నాకు మంచి ఊతమిచ్చింది. అప్పట్లో ఏదైనా ప్రత్యేక కథతో సినిమా చేద్దామనుకున్నప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ రాసిన 'అభిలాష' నవల గుర్తొచ్చింది. కేఎస్ రామారావు, కోదండరామిరెడ్డి, ఇళయరాజా, యండమూరి... ఇలా మేమంతా ఓ టీమ్ వర్క్‌తో ఈ సినిమా చేశాం. అప్పుడే 30 యేళ్లు గడిచిపోయాయా అనిపిస్తోంది'' అన్నారు.

    ''చిరంజీవి సంసిద్ధత వ్యక్తం చేస్తే మళ్లీ అదే యూనిట్‌తో అభిలాష తీయాలని ఉంది''అన్నారు నిర్మాత కేఎస్‌ రామారావు. రామ్‌చరణ్‌తో అభిలాష-2 చేస్తారా అని అడిగితే ఆయనతో ప్రస్తుతం ఓ చిత్రం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ''చిరంజీవి నటనకు ముగ్ధుడినైన నేను నవలలో హీరోకి అదే పేరుపెట్టా. ఆ సినిమా ఘన విజయం సాధించడం, దానికి 30 ఏళ్లు పూర్తి కావడం గర్వంగా ఉంది'' అని యండమూరి చెప్పారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కె.ఎస్.రామారావు ఈ సినిమాను నిర్మించారు. ఇందులో మరణశిక్ష రద్దుకోసం పోరాటం చేసే న్యాయవాదిగా చిరంజీవి కనబరిచిన అసమాన నటన తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది.

    English summary
    Chiranjeevi's Abhilaasha film completed 30 years. The Team clebrated this Occasion at Delhi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X