»   » అలా చిరంజీవి, మోహన్ బాబు కోల్డ్ వార్ క్లోజ్

అలా చిరంజీవి, మోహన్ బాబు కోల్డ్ వార్ క్లోజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత కొంత కాలంగా తమ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ కు చిరంజీవి, మోహన్ బాబు చెక్ పెట్టనున్నారు. వీరిద్దరూ రీసెంట్ గా కలసి తిరిగి స్నేహితుల్లా మెలుగుదామని నిర్ణయించుకున్నారని సమాచారం. అలాగే మోహన్ బాబు...చిరంజీవిని పర్శనల్ గా తమ తాజా చిత్రం ఝుమ్మంది నాదం ఆడియోకు ఛీఫ్ గెస్ట్ గా పిలిచారు. ఈ చిత్రంలో మోహన్ బాబు తన కుమారునితో పాటు లీడ్ రోల్ చేస్తున్నారు. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సీనియర్ దర్శకులు కె.రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని సంగీత భరిత చిత్రంగా రూపొందించారు. ఈ రోజు(మే 28)న ఈ ఆడియో పంక్షన్ జరగనుంది. బాలకృష్ణ కూడా ఈ ఆడియో పంక్షన్ కి రానున్నారు. అయితే చిరంజీవే ఈ పంక్షన్ లో మేజర్ ఎట్రాక్షన్ గా నిలవనున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu