twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గబ్బర్‌ సింగ్‌' ,'రచ్చ', 'జులాయి' ల పై చిరు కామెంట్స్

    By Srikanya
    |

    హైదరాబాద్: పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత 'గబ్బర్‌ సింగ్‌' తో ఘన వజయం సాధించారు. రీసెంట్ గా ఈ చిత్రం వందరోజుల మైలు రాయిని దాటింది. ఈ సందర్భంగా చిరంజీవిని మీడియావారు.... 'గబ్బర్‌ సింగ్‌' తో పవన్‌ కళ్యాణ్‌ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఆ సినిమా చూశాక మీకేమనిపించింది? అని అడిగారు. దానికి ఆయన సమాదానంగా... పరిపూర్ణమైన వినోదాన్ని పండించిన చిత్రమది. ఆ పాత్ర కల్యాణ్‌కి అతికినట్లు సరిపోయింది. కల్యాణ్‌ ప్రతిభను దర్శకుడు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోగలిగాడు. నేను చాలా ఎంజాయ్‌ చేశాను అని చెప్పారు.

    అలాగే తన కుమారుడు రచ్చ చిత్రం కూడా ఈ యేడాది హిట్స్ లో నిలిచింది. దాని గురించి ఆయన్ని.. 'రచ్చ' చూస్తే చరణ్‌లో మీ శైలి నటన, నృత్యం కనిపించాయి. మీ విశ్లేషణ ఏమిటి అని అడిగారు. దానికి చిరంజీవి... ఆ సినిమాలోని చరణ్‌ నటనలో చాలా పరిపక్వత కనిపించింది. చాలామంది విశ్లేషించినట్లే తన నృత్యాల్లో ఇంతకు ముందు కన్నా చక్కటి పరిణతి, సహజత్వం వచ్చాయి. ముఖ్యంగా 'వాన వాన...' పాట విషయానికొస్తే - చరణ్‌లో నన్ను నేను చూసుకొన్నాను. ఆ భావోద్వేగాన్ని తలచుకొంటే చాలా థ్రిల్‌గా అనిపిస్తుంటుంది. నా శైలి నటన, నృత్యం అనేవి చరణ్‌లో అనుకరించినట్లుగా కాకుండా సహజంగా ఉండటంతో అందరూ ఎంజాయ్‌ చేశారని నా భావన అన్నారు.

    ఇక తన మేనల్లుడు అల్లు అర్జున్ నటించిన జులాయి చిత్రం గురించి అడగగా... 'జులాయి' చిత్రం మూడు రోజుల కిందటే చూశాను. బన్నీ హుషారుగా నటించాడు. భావోద్వేగాల్ని పలికించడంలో గతంలో కంటే పరిణతి చూపించాడు. నృత్యాలు బాగున్నాయి అని కితాబు ఇచ్చారు. ఇలా తన కుటుంబం నుంచి వచ్చిన ముగ్గురు హీరోలు హిట్స్ సాధించటంపై ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. వారిని తన దైన శైలిలో అబినందిస్తూ మాట్లాడారు.

    ప్రస్తుత తెలుగు పరిశ్రమ మార్పులపై ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినీ రంగంలో సాంకేతికంగా పలు మార్పులు చోటు చేసుకొంటున్నాయి. వూహాతీతమైన మార్పులు చాలా చోటు చేసుకొంటున్నాయి. కానీ ఒక్క సాంకేతికత మాత్రమే సినిమాను విజయవంతం చేయలేదనే మాట రుజువు అవుతూనే ఉంది. దాన్ని కూడా మనం గమనించాలి. టెక్నాలజీ అనేది కేవలం మెదడుని మాత్రమే తాకుతుంది. కానీ సినిమాలో అంతర్లీనంగా ఉండే భావోద్వేగాలే హృదయానికి చేరతాయి. కదిలిస్తాయి. అయితే సాంకేతికత, భావోద్వేగం... రెండింటినీ సరైన రీతిలో మేళవించుకోగలిగితే ఫలితం బాగుంటుంది అని చెప్పుకొచ్చారు.

    English summary
    Chiranjeevi happy with mega hero's super hits. He is Very much liked his brother Pawan's Gabbar Singh. Chiru says he is enjoyed very much with Gabbar Singh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X