»   » శ్రీహరి మరణవార్త నమ్మలేక పోతున్నా: చిరంజీవి

శ్రీహరి మరణవార్త నమ్మలేక పోతున్నా: చిరంజీవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీహరి మరణవార్త నమ్మలేక పోతున్నాను అని మెగాస్టార్, కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. ఈ విషయం తెలిసి ఎంతో దిగ్ర్భాంతికి గురయ్యానని, ఆయన లేని లోటు తెలుగు సినీ పరిశ్రమకు తీరలేనిదని చిరంజీవి వ్యాఖ్యానించారు. శ్రీహరి మా కుటుంబానికి ఎంతో ఆప్తుడని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రముఖ నటుడు మోహన్ బాబు శ్రీహరి మరణ వార్తపై స్పందిస్తూ.....శ్రీహరి నా తమ్ముడు లాంటి వాడు, ఆయన మరణ వార్త షాక్‌కు గురి చేసింది. ఎంతో మంచి వ్యక్తి. నాకుటుంబంలో ఒకటిగా మెలిగిన వాడు. ఆయన లేని లోటు తీరలేనిది అని వ్యాఖ్యానించారు మోహన్ బాబు.

నటుడు ఏవీఎస్ మాట్లాడుతూ....నాకు వచ్చిన లివర్ సమస్యే శ్రీహరికి వచ్చింది. ఆయన ఇంత త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళతాడని అసలు అనుకోలేదు. అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండే వ్యక్తి. గొప్ప నటుడు. ఆయన ఇక లేరనే విషయం తెలుసుకుని దిగ్ర్భాంతికి గురయ్యాను అని వెల్లడించారు.

శ్రీహరి ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని, అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసే వారు అని ఆయన సన్నిహితులు అంటున్నారు. తన కూతురు అక్షర జ్ఞాపకార్థం పౌండేషన్ స్థాపించి శామీర్ పేట మండలంలోని గ్రామాల్లో పలు సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. శ్రీహరి మృతి పట్ల చలన చిత్ర ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతికి లోనయ్యారు. సంతాపం వ్యక్తం చేసారు.

English summary

 Chiranjeevi and others condolence to Srihari death. Telugu film actor Srihari passed away at a private hospital in Mumbai on Wednesday. Reports say that Srihari who has not been doing well of late, died while undergoing treatment in the hospital.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu