»   » రాజకీయం: హాట్ లేడీకి చిరు మద్దతు! (ఫోటో ఫీచర్)

రాజకీయం: హాట్ లేడీకి చిరు మద్దతు! (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు : కన్నడ హాట్ హీరోయిన్ రమ్య ఈ మధ్య కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ తరుపున రాజకీయాలు చేస్తూ హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. కర్నాటకలోని మాండ్య లోక్‌సభ‌కు త్వరలో జరుగనున్న ఉప ఎన్నికలో ఆమె బరిలోకి దిగుతున్నారు. రమ్య రాజకీయంగా ఎదిగేందుకు తమవంతు ప్రయత్నంగా సాయం చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీ మిత్రులు. రమ్యకు మద్దతుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సాండల్‌వుడ్ చాలెజింగ్ స్టార్ దర్శన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారట.

కర్ణాటక కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం....కేంద్ర మంత్రి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా రమ్య గెలుపు కోసం ప్రచారం చేస్తారని సమాచారం. ఈ ప్రచారంలో సాండల్‌వుడ్ స్టార్ దర్శన్ కూడా పాల్గొన బోతున్నారని తెలుస్తోంది. దర్శన్ తల్లి మీనా టోగుదీప మైసూర్ సిటీ మహిళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావడంతో ఆమె కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతోందని తెలుస్తోంది.

ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నటుడు అంబరీష్ తరుపున కూడా దర్శన్ ప్రచారం చేసారు. దర్శన్‌కు మాండ్యా ప్రాంతంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం, చిరంజీవికి స్టార్ ఇమేజ్ రమ్య గెలుపుకు తోడ్పడతాయని భావిస్తున్నారు.

రమ్యతో పాటు అంబి

రమ్యతో పాటు అంబి

ఇప్పటి వరకు సినిమాల్లో రాణించిన రమ్య తొలిసారిగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ పడుతోంది. ఆగస్టు 21న మాండ్యా లోక్ సభ స్థానానికి ఎన్నిక జరుగబోతోంది. ఎన్నికల ప్రచారంలో అంబరీష్ చురుకుగా పాల్గొంటున్నారు. రమ్య గెలుపును ఆయన ఒక బాధ్యతగా స్వీకరించారు.

కోలుకుంటున్న రమ్య

కోలుకుంటున్న రమ్య

ఇటీవల ఎన్నికల ప్రచారంలో రమ్యకు షాకింగ్ అనుభవం ఎదురైంది. రమ్య తండ్రి ఆర్.టి. నారాయణ్ ప్రచారంలో పాల్గొంటూ గుండె పోటుకుగురై మరణించారు. తండ్రి పోయిన బాధ నుండి రమ్య ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

రమ్య గురించి వివాదాలు

రమ్య గురించి వివాదాలు

రమ్య‌పై కొన్ని వివాదాలు కూడా కొనసాగుతున్నాయి. ఆమె కులం, తండ్రి, కుటుంబం గురించిన విషయాల్లో కొన్ని వివాదాలు ఉన్నాయి. అయితే వాటిని పట్టించుకోకుండా ప్రచారంలో ముందుకు సాగుతోంది రమ్య.

మౌనంగా ఉంటున్న రమ్య

మౌనంగా ఉంటున్న రమ్య

తండ్రి మరణం తర్వాత ఇతర పార్టీల వారు ఆమెపై అనేక విమర్శలు చేస్తున్నారు. తండ్రి మరణాన్ని సానుభూతిగా వాడుకుంటోందని అంటున్నారు. అయితే రమ్య వాటిపై స్పందించకుండా మౌనంగా ఉంటోంది.

హెచ్‌డి కుమారస్వామి అభ్యంతరం

హెచ్‌డి కుమారస్వామి అభ్యంతరం

ప్రొడ్యూసర్ నుండి పొలిటీషియన్‌గా మారిన హెచ్‌డి కుమార స్వామి ఆమెపై విమర్శలు చేసారు. ఎన్నికల ప్రచారంలో ఆమె మొసలి కన్నీరు కారస్తూ సానుభూతి ఓట్లు సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నారని విమర్శిస్తున్నారు.

రమ్య-రాధిక

రమ్య-రాధిక

గతంలో రమ్య, హెడ్‌డి కుమారస్వామి భార్య రాధిక కలిసి పని చేసారు. రమ్య నటించిన లక్కీ చిత్రాన్ని రాధిక నిర్మించింది. గతంలో రాధిక పలు చిత్రాల్లో నటించారు కూడా. ఆ తర్వాత నిర్మాత అయిన హెడ్‌డి‌ కుమార స్వామిని పెళ్లాడారు.

పలు ప్రాజెక్టుల్లో నటిస్తున్న రమ్య

పలు ప్రాజెక్టుల్లో నటిస్తున్న రమ్య

కన్నడ నాట హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమ్య ఇప్పటికే పలు చిత్రాలకు కమిట్ అయింది. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో కొంత కాలం పాటు ఆయా సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.

రమ్య రాబోవు సినిమాలు

రమ్య రాబోవు సినిమాలు

రమ్య నటించిన పలు కన్నడ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. ఆమె దిల్ కా రాజా, నీర్ దోసె, ఆర్యన్ చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి.

English summary
Golden Girl Ramya, who is getting ready for a biggest challenge of her career in the form of Mandya by polls, seems to be getting a boost from her film industry friends. She is likely to be campaigned by Telugu Megastar Chiranjeevi and Sandalwood's Challenging Star Darshan in the forthcoming elections.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu