»   » మెగాస్టార్ చిరంజీవి డైరెక్షన్ లో సినిమా.....!?

మెగాస్టార్ చిరంజీవి డైరెక్షన్ లో సినిమా.....!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవి సినీ రీఎంట్రీ గురించి ఈపాటికే అందరికీ తెలిసిపోయింది. హీరోగా ఫిట్ గా కనిపించేందుకు ప్రస్తుతం చిరు వెయిట్ రిడక్షన్ ప్రాసెస్ లో ఉన్నారు. ఇదిలా వుంటే వచ్చే అక్టోబర్ లో తన 150వ సినిమా విడుదలవుతుందని చిరంజీవి ప్రకటించారు. ఈ చిత్రానికి కథ కూడా రెడీ అయిందని, త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని చిరంజీవి పేర్కొన్నారు. అయితే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరన్నది మాత్రం చిరంజీవి ఇంకా ఎక్కడా చెప్పలేదు. ఈ చిత్రానికి ఒక నోటెడ్ డైరెక్టర్ ని పెట్టుకోవాలని చిరంజీవి ప్లాన్ చేసుకుంటున్నప్పటికీ ఆయనే దర్శకత్వం వహించే అవకాశాలు కూడా లేకపోలేదని టాక్ వినిపిస్తోంది. తన 30ఏళ్ల నట ప్రస్థానంలో దర్శకత్వం వహించలేకపోవడం లోటుగా భావిస్తున్నానని చిరంజీవి లోగడ పలుమార్లు చెప్పారు. అలాగే రాజకీయ రంగంలోకి అడుగిడే ఆలోచనలు లేనప్పుడు తన 150వ చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తానని కూడా ఆయన అన్నారు. రాబోయేది 150వ చిత్రమే కావడంతో దీనికి చిరంజీవి దర్శకత్వం వహించే ఛాన్సెస్ కూడా చాలానే ఉన్నాయని అనుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu