»   » అమ్మ గుడి కోసం చిరంజీవి ..?? లారెన్స్ తల్లి కోసం గుడి కి మెగా హస్తం

అమ్మ గుడి కోసం చిరంజీవి ..?? లారెన్స్ తల్లి కోసం గుడి కి మెగా హస్తం

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  తెలుగు, తమిళ భాషల్లో ఇప్పుడు ఓ స్టార్ గా వెలిగిపోతున్న రాఘవ లారెన్స్ ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే విషయం అందరికీ తెలుసు. ముఖ్యంగా డ్యాన్సర్ నుంచి డైరెక్టర్ స్థాయి వరకు ఎదిగిన లారెన్స్ జీవితం ఓ తెరిచిన పుస్తకమే అనొచ్చు. ఇదిలా ఉంటే, తను జీవితంలో ఈ స్థాయికి చేరడానికి కారణం తన తల్లి అని ఎన్నోసార్లు చెప్పిన లారెన్స్ గొప్ప మనస్సును ఇప్పటికే చాలాసార్లు చూశాం.

  అమ్మ ఫొటోకు నమస్కరించి

  అమ్మ ఫొటోకు నమస్కరించి

  కన్నతల్లి అంటే ఎంతో ప్రేమ వుంటుంది. దాని విలువ వెలకట్టలేం.. ఆమెకు ఎంత చేసినా తక్కువే. ఈ మాటలు నృత్యదర్శకుడు, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌... హైదరాబాద్‌ వచ్చినప్పుడల్లా మీడియాతో చెప్పే మాటలు. ప్రతి ప్రెస్‌మీట్‌ ముందు అమ్మను తలచుకుంటూనే వుంటాడు. సినిమా ఆరంభంలో కూడా అమ్మ ఫొటోకు నమస్కరించి.. ఆ తర్వాత దేవుడి పటాలపై ముహూర్తపు షాట్‌ చిత్రిస్తానని చెప్పేవాడు.

  ముగ్గురు దగ్గర నుంచి విరాళాలు

  ముగ్గురు దగ్గర నుంచి విరాళాలు

  "ఈ గుడి కోసం నేను ముగ్గురు దగ్గర నుంచి విరాళాలు తీసుకున్నాను. వాసు గారు లక్ష ఆర్ బీ చౌదరి 50 వేలు.. ఇవ్వగా చిరంజీవి అన్నయ్య 3 లక్షల రూపాయలు ఇచ్చారు" అని చెప్పాడు. ఇలా విరాళాలు తీసుకోవడానికి కారణం.. ఒకే వ్యక్తి గుడి కట్టకూడదు అని దర్శకుడు వాసు చెప్పడమే.

  అమ్మకు గుడి

  అమ్మకు గుడి

  "ఇలా అమ్మకు గుడి కట్టాలనే ఆలోచన వచ్చినపుడు బతికి ఉన్నవారికి కట్టొచ్చా లేదా అనే డౌట్స్ వచ్చాయి. పేరెంట్స్ చనిపోయాక చాలామంది గుడి కడుతుంటారు. కానీ నేను అమ్మ ఉండగానే కట్టాలని నిర్ణయించుకున్నా. ఈ విషయంపై చాలామంది దగ్గరే సలహాలు సూచనలు తీసుకున్నాకే గుడి కట్టాను" అని చెప్పాడు లారెన్స్.

  స్పూర్తిగా తీసుకోవల్సినవి

  స్పూర్తిగా తీసుకోవల్సినవి

  డాన్స్ మాస్టర్ నుంచి హీరోగా ఆపై స్టార్ డైరెక్టర్ గా మారిన లారెన్స్ జీవితంలో స్పూర్తిగా తీసుకోవల్సినవి చాలానే ఉన్నాయి. తనకు వీలు కుదిరినప్పుడు అవకాశం ఉన్నప్పుడు అన్నార్తులకు శరణార్థులకు వీలైనంత సహాయం చేసే విషయంలో అందరికంటే ముందుండే లారెన్స్ ఇప్పటి దాకా లెక్కలేనన్ని గుప్త దానాలు చేసాడనేది మీడియాకు సైతం తెలియని రహస్యం.

  పబ్లిసిటీ కోరుకోడు

  పబ్లిసిటీ కోరుకోడు

  ఈ విషయంలో పబ్లిసిటీ కోరుకోడు కాబట్టే ఇంకా ఉన్నతంగా కనిపిస్తాడు. ఇప్పుడు మరో కార్యక్రమం ద్వారా అందరి మనసులను హృదయాలను గెలిచేసుకున్నాడు , లారెన్స్ నాన్న గారి స్వగ్రామమైన పూవిరిందవల్లిలో తన తల్లి జ్ఞాపకార్థం ఒక గుడి కట్టించాడు . 2015లో మొదలు పెట్టిన ఈ గుడి నిర్మాణం ఇప్పటికి పూర్తయ్యింది.

  రాజస్తాన్ లో

  రాజస్తాన్ లో

  ముమ్ముర్తులా తన తల్లిని పోలి ఉండే విగ్రహాన్ని రాజస్తాన్ లో ప్రత్యేకంగా తయారు చేయించిన లారెన్స్ ఇప్పుడు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు మొదలు పెట్టాడు. ఇందుకు గాను ఇటీవలే అతిధిగా విచ్చేయడానికి సూపర్ స్టార్ రజనికాంత్ ని కలిసి మరీ ఆయన అంగీకారం తీసుకున్నాడట. త్వరలోనే గుడి తలుపులు తెరుచుకొబోతున్నాయి. కన్నతల్లికి ఇంత కన్నా గొప్ప నివాళి ఇంకేమి ఉండదని అందరు మెచ్చుకుంటున్నారు

  English summary
  Lawrence is building a temple of his mother as he see god in her while his mother is alive. director Vasu’s gave him suggestion that a person shouldn’t build a temple all by himself so, he took Rs one lakh from Vasu, Rs 50,000 from R.B. Chowdary and Rs 3 lakh from Chiranjeevi.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more