»   » 'అప్పలరాజు' రిలీజుకై చిరంజీవి వెయిటింగ్ అంటూ పోస్టర్

'అప్పలరాజు' రిలీజుకై చిరంజీవి వెయిటింగ్ అంటూ పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అప్పలరాజు సినిమా రిలీజుకై మెగాస్టార్ వెయిటింగ్...ఆయన 150 చిత్రానికి దర్సకత్వ అవకాశం అని రూమర్స్ అంటూ సునీల్ తాజా చిత్రం అప్పలరాజు పోస్టర్స్ పై వేసారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం..అప్పలరాజు చిత్రంకి సంభందించిన పోస్టర్స్ ని వర్మ విడుదల చేసారు. అందులో ఈ విధంగా కామిడీ కమ్ సెటైర్ చోటు చేసుకుంది. ఆ పోస్టర్స్ లో సునీల్ డైరక్టర్ ఫోజు పెట్టి కూర్చుని ఉంటాడు. అతని వెనక చిరంజీవి, బాలకృష్ణ, మహేష్, వెంకటేష్, ఎన్టీఆర్, నాగార్జున ఒక్క ఛాన్స్ అడుగుతున్నట్లు నిలబడి ఉంటారు. ఈ స్టార్ హీరోల డూప్ లను పెట్టి ఈ పోస్టర్స్, ట్రైలర్ డిజైన్ చేసారు. అలాగే మరో పోస్టర్ లో స్టార్ హీరోలకు స్టైల్ క్రియేట్ చేస్తా అంటే ఈ సదరు హీరోలంతా అమాయకంగా మాకు క్రియేట్ చేయి అన్నట్లు చూస్తూంటారు.

రొటీన్ సినిమాలనుంచి మిమ్మల్ని రక్షించటానకి వస్తున్నా, రొటీన్ సినిమాలు చూసి విసుగెత్తి నేనే డైరక్టర్ గా మారాను అని ఓ పోస్టర్ పై ఉంటుంది. చిరంజీవి..శంకర్ దాదా ఎంబిబియస్ చిత్రంలోని గెటప్ ని డూపు చిరంజీవికి వేసి ఈ స్టిల్ తీయించారు. ఇవి పోస్టర్స్ గా బయిట వేస్తే మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రం ఓపినింగ్ రోజు కూడా డైరక్టర్స్ అందరి మీదా సెటైరిక్ గా పాట రాసి అందరి నోట్లో నానారు వర్మ. సినిమాలో విషయం ఎలా ఉన్నా వర్మ క్రేజ్ తేవటంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడంటున్నారు.

సినీ పరిశ్రమ బ్యాక్ గ్రౌండ్ లో రెడీ అవుతన్న ఈ చిత్రంలో సునీల్..అమలాపురం నుంచి హైదరాబాద్ వచ్చి సినిమా తీయటం కథాంశం. సినిమా తీయటం వ్యవసాయం చేసినంత ఈజీ అనకునే అతను ఇన్ని సమస్యలు ఫేస్ చేస్తాడు..విజయం ఎట్లా సాధిస్తాడనేది కథ అని చెప్తున్నారు. వర్మ..కాంటాక్ట్ చిత్రంతో పరిచయమైన సాక్షి ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతోంది. అలాగే కలర్స్ స్వాతీ ఈ చిత్రంలో అసెస్టెంట్ డైరక్టర్ గా కనపడుతూ నవ్వులు పండించనుంది. సంక్రాంతి రోజు విడుదల అయ్యే ఈ చిత్రం కోసం వర్మ ఓ పాటను సైతం రాసారు. కోనేరు కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆదర్శ్‌, కృష్ణుడు, వేణుమాధవ్‌, అలీ, తనికెళ్ల భరణి, చలపతిరావు తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: వందిత కోనేరు, కెమెరా: సుధాకర్‌ యెక్కంటి, సహ నిర్మాత: సుమన్‌ వర్మ.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X