»   »  నిర్మాత మృతి పట్ల చిరంజీవి సంతాపం

నిర్మాత మృతి పట్ల చిరంజీవి సంతాపం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Chiranjeevi Expresses Grief Over Vadde Ramesh's Demise
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ మృతి పట్ల ప్రముఖ సినీ నటుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి సంతాపం వ్యక్తం చేసారు. ఈ మేరకు ఆయన కార్యాలయం నుంచి పత్రిక ప్రకటన విడుదల చేసారు. వడ్డే రమేష్ పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారని, ఆయన మంచి అభిరుచిగల నిర్మాత అని పేర్కొన్నారు.

వడ్డే రమేష్ తనకు మంచి స్నేహితుడని, తన 100వ చిత్రం లంకేశ్వరుడు ఆయనే నిర్మించారని, ఇటీవల ఆయన అస్వస్థతకు గురైన విషయం తెలుసుకుని పరామర్శించి వచ్చినట్లు చిరంజీవి తెలిపారు. వడ్డే రమేష్ మృతి తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు.

గత కొంత కాలంగా బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న నిర్మాత వడ్డే రమేష్ హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. రమేష్ మృతితో తెలుగు సినిమా పరిశ్రమలో విషాదం నెలకొంది. విజయమాధవి పిక్చర్స్ బేనర్‌పై ఆయన చిత్రాలు నిర్మించారు.

ఎన్టీఆర్‌తో బొబ్బిలి పులి, కృష్ణం రాజుతో కటకటాల రుద్రయ్య లాంటి హిట్స్ ఇచ్చారు. చిరంజీవితో లంకేశ్వరుడు చిత్రాన్ని నిర్మించారు. కృష్ణా జిల్లా యలమర్రు గ్రామానికి చెందిన వడ్డే రమేష్ కుటుంబం బెజవాడలో సెలైంది. ఆయన తనయుడు వడ్డే నవీన్ కూడా పలు చిత్రాల్లో హీరోగా పని చేసారు.

English summary
Central Minister Of State Of Tourism Dr. K Chiranjeevi expressed his shock over the sudden demise of the ace producer Vadde Ramesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu